Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక

Malli Pelli Telugu Teaser మళ్లీ పెళ్లి టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేష్‌ పవిత్ర రమ్య రఘుపతి బెంగళూర్ హోటల్ ఘటన చుట్టే ఈ సినిమా తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో హైలెట్‌ సీన్‌గా హోటల్ సీన్ నిలిచేట్టుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 01:13 PM IST
  • నెట్టింట్లో మళ్లీ పెళ్లి సందడి
  • నరేష్ పవిత్రల బయోపిక్?
  • హోటల్ సీన్‌ హైలెట్ అవుతుందా?
Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక

Malli Pelli Telugu Teaser న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా.. నరేష్‌ పవిత్రలు లిప్ లాక్ చేస్తూ తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించిన విషయం ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఇది సినిమా ప్రమోషన్ అని అప్పుడు ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ అవన్నీ కూడా తమ సినిమా ప్రమోషనల్ స్టంట్స్ అని తరువాత అర్థం అయింది. మళ్లీ పెళ్లి అంటూ నరేష్‌ పవిత్రలు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేసేస్తున్నారు

తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. ఈ టీజర్‌ను గమనిస్తే.. ఈ సినిమా నరేష్‌ పవిత్ర రమ్య రఘుపతిల కథ అని స్పష్టంగా అర్థం అవుతోంది. రమ్యా రఘుపతి పాత్రను వనిత విజయ్ కుమార్ పోషించినట్టుగా అనిపిస్తుంది. తన భర్త తనను వదిలేశాడని, వేరే వారితో ఉంటున్నాడని మీడియాతో వాపోవడం, మరో వైపు నరేష్‌ పవిత్రలు సరసాలు ఆడుకోవడం చూపించాడు. ఇక టీజర్ చివర్లో బెంగళూరు హోటల్‌లో జరిగిన సీన్‌ను దింపేశాడు డైరెక్టర్ ఎంఎస్ రాజు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News