Mahesh Babu Son Gautam : అమ్మ బాబోయ్ గౌతమ్‌లో ఈ టాలెంట్ ఉందా?.. స్కూల్‌లో స్టేజ్ మీద మహేష్ బాబు తనయుడి నటన

Gautam Ghattamaneni School Stage Performance మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. తన పని తాను అన్నట్టుగా ఉంటాడు. సోషల్ మీడియాలో సితార చేసే అంత అల్లరిని గౌతమ్ చేయడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 12:58 PM IST
  • స్కూల్లో మహేష్ బాబు తనయుడి సందడి
  • గౌతమ్ ఘట్టమనేని స్టేజ్ పర్ఫామెన్స్
  • జూ. మహేష్ బాబు అంటూ నెటిజన్ల కామెంట్లు
Mahesh Babu Son Gautam : అమ్మ బాబోయ్ గౌతమ్‌లో ఈ టాలెంట్ ఉందా?.. స్కూల్‌లో స్టేజ్ మీద మహేష్ బాబు తనయుడి నటన

Gautam Ghattamaneni School Stage Performance : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండదు. మహేష్‌ బాబుతో సితారా చేసే అల్లరి, సితార తన స్నేహితులతో కలిసి నెట్టింట్లో చేసే అల్లరి మామూలుగా ఉండదు. గౌతమ్‌ని సితారా తెగ ఏడిపిస్తుంటుంది. కానీ గౌతమ్ మాత్రం ఎంతో సైలెంట్‌గా ఉంటాడు. ఎక్కడా కూడా ఎక్కువగా కనిపించడు. ఎక్కువగా మాట్లాడడు. తన లోకమేదో తాను అన్నట్టుగా సైలెంట్‌గా ఉంటాడు.

అలాంటి గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించాడు. మహేష్‌ బాబు సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో గౌతమ్ చక్కగా నటించాడు. గౌతమ్‌, మహేష్‌ బాబు అలా ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చే సీన్‌ను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే మళ్లీ ఇంత వరకు గౌతమ్‌ను స్క్రీన్ మీదకు తీసుకురాలేదు మహేష్ బాబు.

కానీ మహేష్‌ బాబు తనయుడిగా గౌతమ్‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. తాజాగా గౌతమ్ తన స్కూల్లో నాటకం వేశాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా స్టేజ్ మీద డ్యాన్సులు వేశాడు. నటించేశాడు. ఈ గెటప్ కూడా కొత్తగా, వింతగా ఉంది. గౌతమ్‌ని అలా చూసిన నెటిజన్లు అచ్చం మహేష్‌ బాబులా ఉన్నాడని, అతడు సినిమా టైంలో ఉన్న మహేష్‌ బాబులా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

ఈ వీడియోను షేర్ చేస్తూ నమ్రత అయితే తెగ మురిసిపోయింది. గౌతమ్ లవ్వులో పెద్ద ఎక్స్‌పర్ట్ ఏమీ కాదు..కానీ అతని ఫ్రెండ్స్ మాత్రం అందులో ఆరితేరిపోయారు. హై స్కూల్లో గౌతమ్ మొదటి సారిగా ఇలా స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. గౌతమ్ తన స్టైల్లో అదరగొట్టేశాడు.. ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాలి మై బాయ్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. లవ్యూ సో మచ్ అంటూ గౌతమ్ గురించి చెబుతూ నమ్రత మురిసిపోయింది.

Also Read : Pawan Kalyan Gundu : పవన్ కళ్యాణ్‌కు నిజంగానే గుండు కొట్టించారా?.. అసలు విషయం చెప్పిన పరిటాల శ్రీరామ్

Also Read : Hari Teja Bold Pics : ఫారిన్ వీధుల్లో హరితేజ సందడి.. పొట్టి నిక్కర్లో అందాల ప్రదర్శన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News