KGF 2 Movie Scenes: 'ఇంద్ర' సినిమాలోని సన్నివేశాన్ని కాపీ కొట్టిన 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్?

KGF 2 Movie Scenes: కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన 'కేజీఎఫ్ 2'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశం.. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' సినిమాను పోలిఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అదేంటో మీరే చూడండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 03:10 PM IST
KGF 2 Movie Scenes: 'ఇంద్ర' సినిమాలోని సన్నివేశాన్ని కాపీ కొట్టిన 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్?

KGF 2 Movie Scenes: స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 1'. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఊహించని విధంగా క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో యష్ నటన, స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్, ఎలివేషన్స్, కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో.. దీని సీక్వెల్ 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' ను ఇటీవలే థియేటర్లలో విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం సహా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. రూ. 500 కోట్ల కలెక్షన్స్ కు అతి చేరువలో ఉంది. ఈ క్రమంలో 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevikonidela 🔵 (@chiranjeevikonidelafc.k)

'కేజీఎఫ్ ఛాప్టర్ 2' సినిమాలోని ఓ సన్నివేశం.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర' మూవీలోని ఓ సన్నివేశాన్ని పోలి ఉందని మెగా అభిమానులు అంటున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బహుశా చిరంజీవి అభిమానినని చెప్పిన ప్రశాంత్ నీల్ పై 'ఇంద్ర' ప్రభావం పడి.. అదే సన్నివేశాన్ని పోలిన సీన్ క్రియేట్ చేసి ఉంటాడని గుసగుసలు వస్తున్నాయి. అందుకు సంబంధఇంచిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Also Read: Ante Sundaraniki Teaser: అంటే.. అంటే.. అంటే సుందరానికీ!.. ఆ గండాలెక్కువట!

ALso Read: Neha Sharma Photos: 'చిరుత' హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News