Vicky Katrina Roka: పెళ్లికి సిద్ధమైన విక్కీకౌశల్ – కత్రినా.. దీపావళి రోజున జరిగిన రోకా ఫంక్షన్?

Vicky Katrina Roka: బాలీవుడ్​ లవ్ బర్డ్స్ విక్కీకౌశల్, కత్రినాకైఫ్​​ (Katrina Vicky Kaushal) రహస్యంగా రోకా ఫంక్షన్​ చేసుకున్నట్లు సమాచారం. దీపావళి రోజున వీరిద్దరి కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో సందడి చేశారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి (Katrina Kaif Vicky Kaushal Engaged). డిసెంబర్​లో వీరి వివాహం జరగనున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 11:17 AM IST
    • పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీకౌశల్ – కత్రినా కైఫ్
    • దీపావళి రోజున ఇరు కుటుంబాల మధ్య జరిగిన రోకా ఫంక్షన్
    • డిసెంబరులో రాజస్థాన్ లోని ఓ కోటలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం
Vicky Katrina Roka: పెళ్లికి సిద్ధమైన విక్కీకౌశల్ – కత్రినా.. దీపావళి రోజున జరిగిన రోకా ఫంక్షన్?

Vicky Katrina Roka: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్ నటి కత్రినాకైఫ్‌, నటుడు విక్కీకౌశల్‌ త్వరలో ఏడడుగుల బంధంలోకి (Katrina Vicky Kaushal Marriage) అడుగుపెట్టనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ నెలలో వీరి వివాహం జరగనుందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విక్కీ-కత్రినాలకు దీపావళి రోజున రోకా ఫంక్షన్‌ జరిగినట్లు సమాచారం. కత్రినాకు ఎంతో ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో ఈ వేడుక నిర్వహించారట.

కత్రినా, ఆమె తల్లి సుజానే టర్కోయెట్, ఇసాబెల్, విక్కీ, ఆయన తల్లిదండ్రులతోపాటు సోదరుడు సన్నీ కౌశల్‌ ఈ వేడుకలో పాల్గొని.. వివాహానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారట. ఇరు కుటుంబాలు పలు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, ఉత్తర భారతదేశంలో రోకా ఫంక్షన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వధూవరుల కుటుంబసభ్యులు ఒకచోట కలుసుకుని పెళ్లి తంతు, కట్నకానుకలపై మాట్లాడుకుని.. అన్నీ ఓకే అనుకున్నాక స్వీట్స్‌, ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

విక్కీ-కత్రినా (Katrina Vicky Kaushal) కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. కత్రినా అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలు సందర్భాల్లో విక్కీ బయటపెట్టారు. మరోవైపు కత్రినా సైతం విక్కీపై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. విక్కీ నటించిన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి పెళ్లి (Katrina Kaif Vicky Kaushal Wedding) జరగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Anushka Shetty New Movie: అనుష్క బర్త్డే సర్ ప్రైజ్.. యూవీ క్రియేషన్స్ తో కొత్త సినిమా ప్రకటన  

Also Read: Janhvi kapoor: చెల్లెలి పుట్టినరోజున బార్బీగర్ల్‌గా ఆకట్టుకున్న జాన్ఙవి కపూర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News