Kajal Aggarwal in Acharya: 'ఆచార్య' మూవీ టీజర్, ట్రైలర్ లలో కాజల్ అగర్వాల్ లేదేంటి?

Kajal Aggarwal in Acharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. ఏప్రిల్ 29న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. కానీ, అందులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించకపోవడంపై అందరిలోనూ ఏమైందా అనే డౌట్ మొదలైంది. దానిపై డైరెక్టర్ కొరటాల శివ స్పందించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 10:32 AM IST
Kajal Aggarwal in Acharya: 'ఆచార్య' మూవీ టీజర్, ట్రైలర్ లలో కాజల్ అగర్వాల్ లేదేంటి?

Kajal Aggarwal in Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. అయితే అందులో తొలుత హీరోయిన్ గా అనుకున్న కాజల్ అగర్వాల్ లేకపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో రిలీజ్ అయిన 'లాహే.. లాహే..' సాంగ్ లోనూ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. 

కానీ, ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్లలో కాజల్ ఊసే లేదు. ఈ క్రమంలో సినిమాలో కాజల్ అగర్వాల్ నటించారా? లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న క్రమంలో 'ఆచార్య' మూవీ డైరెక్టర్ స్పందించారు. 'ఆచార్య'లో కాజల్ అగర్వాల్ ను తొలగించినట్లు స్పష్టం చేశారు. దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. 

ఏం జరిగిందంటే?

'ఆచార్య' సినిమా పట్టాలెక్కిన సమయంలోనే ఈ చిత్ర నటీనటుల గురించి చిత్రబృందం ఓ ప్రకటన చేసింది. ఇందులో చిరంజీవి, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని మేకర్స్ తెలిపారు. వీరితో పాటు సోనూసూద్, తనికెళ్ల భరణి, సంగీత తదితరులు నటించనున్నారని ప్రకటించింది. అయితే అంతలోనే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకున్నట్లు రూమర్లు వచ్చాయి. 

కొన్ని రోజుల తర్వాత అది నిజమేనంటూ చిత్రబృందం స్పష్టం చేసింది. ఆ తర్వాత సినిమా నుంచి 'లాహే.. లాహే..' లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. అందులో సంగీత స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. అయితే ఆ వీడియోలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కనిపించారు. కానీ, ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్లలో కాజల్ అగర్వాల్ లేకపోవడంతో ఆమె సినిమాలో లేదనే వార్తలు వచ్చాయి. దానిపై డైరెక్టర్ కొరటాల శివ స్పందించారు. 

కాజల్ అంగీకారంతోనే..

సినిమాలో చిరంజీవి నక్సల్ గా కనిపించనున్నారని విషయం తెలిసిందే! అయితే అలాంటి పవర్ ఫుల్ పాత్రకు లవ్ స్టోరీ యాడ్ చేయడం బాగోలేదని.. అందుకే కాజల్ అగర్వాల్ పాత్రను సినిమా నుంచి తొలగించినట్లు కొరటాల శివ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తొలుత కాజల్ పై కొన్ని సన్నివేశాలను షూట్ చేసినా.. ఆమె పాత్రను కథలో ఎలా ముగించాలో తెలియలేదని, అందుకే ఆమెను సినిమా నుంచి తొలగించినట్లు కొరటాల శివ వెల్లడించారు. ఇదే విషయాన్ని కాజల్ కు తెలియచెప్పగా.. ఆమె అందుకు అంగీకరించారని ఆయన అన్నారు.   

Also Read: Ananya Pandey Photos: ట్రెక్కింగ్ ను ఆస్వాదిస్తున్న లైగర్ బ్యూటీ- ఫొటోలు వైరల్!

Also Read: Sarkaru Vaari Paata Story: మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా పూర్తి స్టోరీ ఇదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News