Naga Chaitanya Fined: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో తనిఖీల సందర్భంగా నాగ చైతన్య కారును ఆపిన పోలీసులు.. కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్‌తో తిరుగుతున్నందుకు రూ.700 చలానా విధించారు. ఆ సమయంలో నాగ చైతన్య కారులోనే ఉన్నారు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు వరుసపెట్టి జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒక్కటేనని చెప్పకనే చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్‌లకు కూడా 'బ్లాక్ ఫిల్మ్' కారణంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. గత వారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కారుకు బ్లాక్ ఫిల్మ్‌తో వెళ్తుండగా... వాహనాన్ని ఆపి జరిమానా విధించారు.
కేవలం 'వై' కేటగిరీ భద్రత ఉన్నవారికి మాత్రమే బ్లాక్ ఫిల్మ్ నుంచి మినహాయింపు ఉంది. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫిల్మ్‌తో కనిపించే కార్లకు జరిమానా తప్పట్లేదు. ఇకనైనా సెలబ్రిటీలు రోడ్ల పైకి వచ్చే ముందు తమ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీ బిజీగా నాగ చైతన్య :
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో నాగ చైతన్య బిజీ బిజీగా గడుపుతున్నాడు. బంగార్రాజు హిట్‌తో జోష్ మీదున్న చైతన్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'థాంక్యూ' సినిమాతో పాటు బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చద్దా'లో చైతన్య నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Broccoli: బ్రకోలీ జ్యూస్... రోగాలను తన్ని తరిమేసే ఔషధం... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook