Guntur Kaaram Songs: గుంటూరు కారం నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఓ మై బేబీ’ వచ్చేసింది..

Guntur Kaaram Songs: మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజైంది.  ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 07:39 PM IST
Guntur Kaaram Songs: గుంటూరు కారం నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఓ మై బేబీ’ వచ్చేసింది..

Guntur Kaaram 'Oh My Baby 'Song Released: సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం (Guntur Kaaram). తాజాగా (డిసెంబర్ 13) ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ రిలీజైంది. ‘ఓ మై బేబీ’ (Oh My Baby Song)అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. డిసెంబరు 11న ఈ సాంగ్ ప్రోమో విడుదల చేయగా.. తాజాగా పుల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో శ్రీలీల, మహేష్ కెమెస్ట్రీ అదిరింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శిల్పా రావు అలపించారు. గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలి సాంగ్  కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News