Devara: దేవర లో ఎన్టీఆర్ భార్యగా.. సినిమాలోని అసలు విషయం బయటపెట్టిన హీరోయిన్

Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతోంది. ఆమె ఎన్టీఆర్ భార్య పాత్రలో కనిపించనుంది. ఆమె మరెవరో కాదు గుజరాతి నటి శృతి మరాఠే..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2024, 11:51 AM IST
Devara: దేవర లో ఎన్టీఆర్ భార్యగా.. సినిమాలోని అసలు విషయం బయటపెట్టిన హీరోయిన్

NTR Devara : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో విడుదల కాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. 

అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఎన్టీఆర్ సరసన నటించనుంది. కొడుకు ఎన్టీఆర్ పాత్రకు జాన్వి కపూర్ జంటగా నటిస్తుండగా తండ్రి ఎన్టీఆర్ పాత్రకు ఒక గుజరాతి నటి భార్య పాత్రలో కనిపించనుందట. 

ఆమె శృతి మరాఠే. అయితే ఈ రూమర్ ఎన్నో రోజుల నుంచి చక్కర్లు కోరుతున్న ఇప్పుడు ఏకంగా ఆ హీరోయిన్ అఫీషియల్ గా చెప్పి కన్ఫామ్ చేసింది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి కూడా ఆమె తెలియచేయడం విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతిని యాంకర్ ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారట కదా అని అడగగా ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. "నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి పని చేస్తున్నాను. సినిమాలో నాది ఆయన భార్య పాత్ర. ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో నేను కూడా ఒక భాగం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది" అని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది శృతి.

2003లో టీవీ రంగంలో తన కెరీర్ మొదలు పెట్టిన శృతి 2008లో సనాయ్ చౌఘడే అనే మరాఠీ సినిమా తో వెండి తెర కు కూడా పరిచయం అయింది. 2016లో యాక్టర్ గౌరవ్ ఘట్నేకర్‌ని శృతి వివాహం చేసుకుంది కానీ నటిగా మాత్రం తన కెరీర్ ను కొనసాగిస్తూనే వస్తోంది. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. 

సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, నరైన్, కలైయరసన్, అభిమన్యు సింగ్ తదితరులు ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదల అయిన రెండు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ అందింది.  

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ సమర్పిస్తుండగా, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య దేవర మొదటి భాగం దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 10న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.

Also Read: Telangana: ఆనాడే అత్యంత ధనిక సీఎం కేసీఆర్‌.. ఆయనకు హెలికాప్టర్‌ ఎక్కడిది?

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News