Grammy Awards 2022: కరోనా ఎఫెక్ట్.. గ్రామీ అవార్డుల వేడుక వాయిదా!

Grammy Awards 2022: కరోనా నేపథ్యంలో..లాస్ ఏంజెల్స్‌లో జనవరి 31న జరగాల్సిన 64వ గ్రామీ అవార్డుల ఈవెంట్‌ వాయిదా పడింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 03:36 PM IST
  • గ్రామీ అవార్డులకు కరోనా సెగ
  • 64వ గ్రామీ అవార్డుల ఈవెంట్‌ వాయిదా
  • త్వరలో కొత్త తేదీ ప్రకటన
Grammy Awards 2022: కరోనా ఎఫెక్ట్.. గ్రామీ అవార్డుల వేడుక వాయిదా!

Grammy Awards 2022 postponed: యూఎస్ లో కరోనా (COVID-19) కల్లోలం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో...లాస్​ ఏంజెల్స్​లో జరగాల్సిన గ్రామీ అవార్డుల (Grammy Awards 2022) వేడుక వాయిదా పడింది. ఈ విషయమై గ్రామీ అధికారిక ప్రసార సీబీఎస్ (CBS ), ది రికార్డింగ్ అకాడమీ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

64వ వార్షిక గ్రామీ అవార్డుల (64th Annual GRAMMY Awards) వేడుక షెడ్యూల్​ ప్రకారం జనవరి 31న నిర్వహించాల్సి ఉంది. ఒమిక్రాన్ (Omicron variant) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి వల్ల ఈవెంట్​లో ఇబ్బంది ఏర్పడవచ్చని అకాడమీ అంచనా వేసింది. సంగీత నిర్వహకులు, ప్రేక్షకులు, వేడుక కోసం పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని చెప్పిన అకాడమీ.. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. 

Also Read: Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!

గతేడాది కూడా కరోనా వల్ల గ్రామీ అవార్డుల వేడుక కొంతకాలం వాయిదా పడింది. ఆ తర్వాత స్టేపుల్స్ సెంటర్​కు బదులుగా లాస్​ ఏంజెల్స్​లోని (Los Angeles) కన్వెన్షన్​ సెంటర్​లో అవుట్​డోర్​ సెట్​లో ఈ కార్యక్రమం జరిగింది. గతేడాది ప్రేక్షకుల సీటింగ్ కెపాసిటీ తగ్గించడమే కాకుండా లైవ్​ ప్రదర్శన కూడా ఇవ్వలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News