Tollywood డైరెక్టర్ మారుతితో గోపిచంద్ నెక్ట్స్ మూవీ.. ఇంట్రెస్టింగ్

Gopichand Teams Up With Director Maruthi For His Next Film: యాక్షన్ మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు గోపిచంద్ తర్వాతి ప్రాజెక్టు కన్ఫామ్ అయింది. కామెడీ ప్రధానంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతితో గోపిచంద్ 29వ సినిమా ఫిక్స్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2021, 12:33 PM IST
  • యాక్షన్ మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు గోపిచంద్
  • కామెడీ ప్రధానంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతి
  • గోపిచంద్ 29వ సినిమా మారుతి దర్శకత్వంలో కన్ఫామ్ చేశారు
Tollywood డైరెక్టర్ మారుతితో గోపిచంద్ నెక్ట్స్ మూవీ.. ఇంట్రెస్టింగ్

Gopichand Teams Up With Director Maruthi For His Next Film: మాస్, యాక్షన్ మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు గోపిచంద్ తర్వాతి ప్రాజెక్టు కన్ఫామ్ అయింది. కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ ప్రధానంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతితో గోపిచంద్ 29వ సినిమా ఫిక్స్ అయింది. ఈ మేరకు దర్శకుడు మారుతి విభిన్నంగా సినిమా ప్రకటనను రిలీజ్ చేశారు. ట్విట్టర్‌లో ఈ మేరకు వీడియో రూపంలో సినిమాను అనౌన్స్ చేశారు.

న్యూస్ ఛానెల్స్ వార్తలు చదువుతున్నట్లుగా కొత్తదనాన్ని చూపిస్తూ తన లేటెస్ట్ మూవీ గోపిచంద్‌తో అని, బయట నుంచి వచ్చే ఏ విషయాలు నమ్మవద్దని సూచిస్తూ Tollywood డైరెక్టర్ మారుతి యూవీ క్రియేషన్స్ యూట్యూబ్ వీడియోను తన ఫాలోయర్లతో పంచుకున్నారు. ప్రతిరోజూ పండగే తర్వాత దర్శకుడు మారుతి తీయబోతున్న సినిమా ఇదే అంటూ యాక్షన్ హీరో గోపిచంద్‌తో లేటెస్ట్ ప్రాజెక్టు గురించి వెల్లడించారు.

Also Read: తొలి హీరోయిన్ Kajal Aggarwal‌తో కాదు.. చందమామ స్థానంలో తాప్సీ!

ఈ మూవీని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నారు. కొత్త సంవత్సరాన్ని పాజిటివిటితో మొదలుపెడుతున్నట్లు దర్శకుడు మారుతి పేర్కొన్నారు. అందరికీ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

తాజా ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. కానీ సినిమా అనౌన్స్‌మెంట్ ప్రమోషన్ నెటిజన్లతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మీ ముందుకు తీసుకొస్తానంటూ డైరెక్టర్ మారుతి(Director Maruthi) ట్విట్ చేశారు. 

Also Read: Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News