Free OTT: పైసా ఖర్చులేకుండా ఉచితంగా అందుబాటులో ఉన్న ఓటీటీల జాబితా

Free OTT: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు ఓటీటీలు భారంగా మారుతున్నాయి. అయితే ఉచితంగా వీక్షించే ఓటీటీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2022, 11:49 PM IST
Free OTT: పైసా ఖర్చులేకుండా ఉచితంగా అందుబాటులో ఉన్న ఓటీటీల జాబితా

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోనే కాకుండా..ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే..క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇండియాలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా వంటి పెయిడ్ ఓటీటీలున్నాయి. ఇందులో సినిమాలు లేదా వెబ్‌సిరీస్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. ఇది సామాన్యుడికి భారంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఉచితంగా కూడా కొన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉచితంగా లేటెస్ట్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు. అయితే ఈ ఉచిత యాప్స్‌లో వాణిజ్య ప్రకటనలు అధికంగా ఉంటాయి మరి.

MX Player

ఉచిత ఓటీటీల్లో ముఖ్యమైంది ఎంఎక్స్ ప్లేయర్. చాలా కాలం క్రితం ఆఫ్‌లైన్ వీడియో ప్లేయర్‌గా ప్రారంభమైంది. నెమ్మదిగా ఓటీటీగా మారింది. ఇది పూర్తిగా ఉచితం. దీనికోసం ఏ విధమైన సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. మొత్తం 12 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో లేటెస్ట్ వెబ్‌సిరీస్, సినిమాలు అందుబాటులో ఉంటాయి.

Jio Cinema

ప్రముఖ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో అందిస్తున్న జియో సినిమా కూడా ఉచిత ఓటీటీ వేదిక. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియో యూజర్లకు ఇది పూర్తిగా ఉచితం. ఇందులో చాలా భాషల్లో సినిమాలు ఉంటాయి. 

Voot

ఇది కూడా అధిక ప్రాచుర్యంలో ఉన్న ఓటీటీ వేదిక. ఉచితంగా వెబ్‌సిరీస్, సీరియల్స్, సినిమాలు చూడాలంటే సరైన వేదిక వూట్. దీనిని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. నెట్‌వర్క్ 18 కు సంబంధించిన ఛానెల్స్ కూడా చూడవచ్చు. 

Tubi

హాలీవుడ్ సినిమాలంటే ఆసక్తి చూపించేవారికి టూబి ఓటీటీ ఉపయోగంగా ఉంటుంది. ఇందులో చాలా రకాల హాలీవుడ్ సినిమాలున్నాయి. అయితే మధ్యమధ్యలో యాడ్స్ గందరగోళం ఎక్కువ ఉంటుంది.

Plex

ఇది మరో ఉచిత ఓటీటీ వేదిక. ఇందులో కూడా ఉచితంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు. ఈ ఓటీటీ యాప్‌లో మీరు 2 వందల కంటే అధికంగా లైవ్ ఛానెల్స్ ఉచితంగా చూడవచ్చు. ఇందులో హిందీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి.

Also read: Aamir Khan Controversy: మరో వివాదంలో ఆమీర్ ఖాన్.. హిందూ సంప్రదాయాలు మార్చేస్తున్నారంటూ ఫైర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News