Viraata Parvam First look: రానా బర్త్‌డే స్పెషల్.. విరాటపర్వం ఫస్ట్ లుక్ వచ్చేసింది 

First look of Rana Daggubati from Viraata Parvam: రానా దగ్గుబాటి పుట్టినరోజు నేడు. బాహుబ‌లి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రానా లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’తో బిజీగా ఉన్నాడు. నేడు రానా బర్త్‌డే సందర్భంగా ‘విరాటపర్వం’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Last Updated : Dec 14, 2020, 11:10 AM IST
  • హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి
  • విరాటపర్వం ఫస్ట్ లుక్ వచ్చేసింది
  • నేడు రానాకు డబుల్ ధమాకా
Viraata Parvam First look: రానా బర్త్‌డే స్పెషల్.. విరాటపర్వం ఫస్ట్ లుక్ వచ్చేసింది 

First look of Rana Daggubati from Viraata Parvam: టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి పుట్టినరోజు నేడు. బాహుబ‌లి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రానా లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’తో బిజీగా ఉన్నాడు. నేడు రానా బర్త్‌డే సందర్భంగా ‘విరాటపర్వం’ ఫస్ట్ లుక్ (Viraata Parvam First Look) విడుదల చేశారు. ఈ విరాటపర్వం ఫస్ట్ లుక్ గమనిస్తే.. రానా చేతిలో గన్ ఉంది. నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లుగా అర్థమవుతోంది.

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి (Rana Daggubati) లీడ్ రోల్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ రూపొందిస్తున్నారు డైరెక్టర్. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ‘విరాటపర్వం’ (Viraata Parvam) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. 

Gallery: Payal Rajput Photos: నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫొటోస్ 

  

నేడు రానా పుట్టినరోజును పురస్కరించుకుని మూవీ యూనిట్ బర్త్‌డే సర్‌ప్రైజ్ అందించింది. వాస్తవానికి ఈరోజు రానాకు డబుల్ ధమాకా. మరికాసేపట్లో విరాటపర్వం టీజర్ సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది విరాటపర్వంతో రానా థియేటర్లకు రానున్నాడు.
Also Read : Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News