Prabhas: ప్రభాస్‌కు ఆ సత్తా ఉంది: ఆకాశానికెత్తేసిన దర్శకుడు

బాహుబలి ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ సినిమాల మీద భారీగా అంచనాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో వచ్చిన సాహో కలెక్షన్లు రాబట్టినా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మరో క్రేజీ ప్రాజెక్టుకు ప్రభాస్ ఓకే చెప్పాడు.

Last Updated : Mar 3, 2020, 11:09 AM IST
Prabhas: ప్రభాస్‌కు ఆ సత్తా ఉంది: ఆకాశానికెత్తేసిన దర్శకుడు

టాలీవుడ్‌లో రెండు మేజర్ ప్రాజెక్టులలో ఒకటి RRR మూవీ కాగా, రెండో సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా. బయోపిక్‌లను టచ్ చేసి ఎంతో మంది చేతులు కాల్చుకున్నా.. సావిత్రి లాంటి గొప్ప నటి బయోపిక్ ‘మహానటి’ తీసి భేష్ అనిపించుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. తన తదుపరి సినిమా ప్రభాస్‌తో అని ప్రకటించగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. దీంతో ప్రభాస్‌ను లేటెస్ట్ సినిమాకు ఎందుకు ఎంపిక చేసుకున్నాడో నాగ్ అశ్విన్ బహిర్గతం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు

తాను అనుకున్న పాత్రకు టాలీవుడ్‌లో ప్రభాస్ తప్ప.. మరో హీరో సరిపోడని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఆ పాత్రను పోషించగల సత్తా ప్రభాస్‌కు ఉందని తాను నమ్మి సెలక్ట్ చేసుకున్నట్లు చెప్పాడు. గతేడాది నుంచి ఎంతో డిమాండ్ ఉన్న సైంటిఫిక్ ఫిక్షన్ కథ తాను కొత్త కోణంలో చూపించనున్నట్లు తెలిపాడు. సినిమా మాత్రం అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించనున్నట్లు వివరించాడు.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ  

తనలాగే ప్రభాస్ కూడా సినిమాపై ఆసక్తిగా ఉన్నాడని, కథ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యాడని నాగ్ అశ్విన్ వెల్లడించాడు. అభిమానులకు కావాల్సిన వినోదాన్ని సైతం అందించే ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పాడు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. కాగా, ఈ సినిమా తర్వాతే నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ కలిసి పనిచేస్తారని తెలుస్తోంది.

See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా? 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News