Vidyullekha Raman: తెలుగు, తమిళ్ భాషల్లో కమెడియన్ గా, క్యారక్టర్ అరిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యుల్లేఖ. చాలా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ..తాజాగా సన్న బడింది. గతేడాది తన(vidyullekha raman wedding) స్నేహితుడి సంజయ్‌తో నిశ్చితార్థం జరగ్గా, కొన్ని రోజులు కిందట వివాహం(Marriage) కూడా చేసుకున్నారు. కరోనా కారణంగా బంధువుల, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవుల(Maldevis)కు వెళ్లింది. అక్కడ ప్రకృతిలో గడుపుతున్న ఫొటోలను విద్యుల్లేఖ అభిమానులతో పంచుకుంది. తాజాగా బికినీ(Bikini)లో బీచ్‌లో దిగిన ఫొటో షేర్ చేస్తూ 'ఏడాదికి రెండుసార్లు ఆరు నెలల పాటు సెలవులు కావాలి' అని పేర్కొంది. తెలుపు, పసుపు రంగు స్విమ్ సూట్ ధరించి, కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోకు కామెంట్స్ వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. 'విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు' అని అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, విద్యుల్లేఖ రామన్(Vidyullekha Raman) ఘాటుగా రిప్లై ఇచ్చారు.
Also read: Shamita Shetty about Raj Kundra: రాజ్ కుంద్రా అరెస్ట్‌పై పెదవి విప్పిన షమిత శెట్టి
ఇక నైనా మారండి..
దీనిపై స్పందిస్తూ.. 1920 నుంచి 2021లోకి రండి. సమాజంలోని ఆలోచనా విధానమే పెద్ద సమస్య. ఒకవేళ ఆడవాళ్లు వేసుకునే బట్టలే విడాకుల(Divorce)కు కారణం అయితే… సంప్రదాయంగా బట్టలు వేసుకునే వారంతా వైవాహిక జీవితాల్లో సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించింది. అదేవిధంగా సంజయ్ లాంటి భర్త లభించడం నా అదృష్టం అంటూ తన సోషల్ మీడియా(Social Media)లో రాసుకొచ్చింది విద్యులేఖ.
ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఈమె తెలుగులో 'ధ్రువ', 'సరైనోడు', 'రాజా ది గ్రేట్', 'రాజు గారి గది2', 'తొలిప్రేమ', 'మహర్షి' తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook