Kulasekhar death: ఇదిలా ఉండగా తాజాగా.. గీత రచయితగా మంచి పేరు సొంతం చేసుకొని భారీ పాపులారిటీ అందుకున్న కులశేఖర్ ఈరోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇకపోతే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈయన ఈరోజు గాంధీ హాస్పిటల్ లో చివరి శ్వాస విడిచినట్లు వైద్య బృందం బులెటిన్ విడుదల చేసింది.
ఇక ఈ విషయం తెలిసి పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అంతేకాదు ఈ కష్టసుఖంలోనే ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కూడా కోరుతున్నారు.
ఇక గీత రచయిత కులశేఖర్ విషయానికి వస్తే 1971 ఆగస్టు 15వ తేదీన సింహచలంలో జన్మించారు. ప్రముఖ వార్తాపత్రిక ఈనాడు సంస్థల్లో జర్నలిస్టుగా ,తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక్కడ గీత రచయితగా మంచి పేరు కూడా సొంతం చేసుకున్నారు కుల శేఖర్.
వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమాలో పాటలతో పాటు డైలాగ్స్ కూడా అందించారు కులశేఖర్ ఒక సీన్ డైలాగ్స్ చూసిన వెంకటేష్ స్వయంగా నువ్వే ఈ సినిమాకి డైలాగ్స్ రాసేయనడంతో ఘర్షణ సినిమాకి ఈయన మాటలు అందించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారని వార్తలు కూడా గతంలో వినిపించాయి.
కొందరు దొంగ అని ముద్ర వేయగా, మరికొంతమంది పిచ్చివాడు అంటూ కామెంట్లు చేశారు. దీనికి కారణం ఒక హీరోయిన్ అని కూడా గతంలో వార్తలు వినిపించాయి. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీత, సాహిత్యల మీద ఎక్కువగా ఆసక్తి ఉండేదట చదువుకుంటున్న రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు కూడా అందుకున్నారట.
ఈ టాలెంట్ వల్లే దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ పరిచయం అయ్యారు. ముఖ్యంగా 100 సినిమాలకు పాటలు రాశారు. ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు తుది శ్వాస విడవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు
Read more: Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.