Unstoppable With NBK: అన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం.. ఛార్మితో బాలయ్య..

Unstoppable with NBK: రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కిక్​ బాక్సింగ్ చేశారు నటసింహం బాలకృష్ణ. ఇది జరిగింది బాక్సింగ్​ రింగ్​లో కాదు. బాలయ్య 'అన్​స్టాపబుల్​' షోలో. మీరు ఓ లుక్కేయండి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 07:07 AM IST
  • బాలయ్య షో లో లైగర్ టీం సందడి
  • ఈ ఎపిసోడ్ సంక్రాంత్రి కానుకగా టెలికాస్ట్
Unstoppable With NBK: అన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం.. ఛార్మితో బాలయ్య..

Unstoppable with NBK: అఖండ సినిమా ( Akhanda Movie) బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పుల్ జోష్ మీదున్నాడు నటసింహం బాలకృష్ణ (Balakrishna). అటు వెండితెరపైనే కాదు..ఇటు ఓటీటీలోనూ సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య వ్యాఖ్యతగా 'అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే' (Unstoppable With NBK) షో వస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే ఈ షో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు, బ్రహ్మనందం, అనిల్ రావిపూడి, రవితేజ, రాజమౌళి, కీరవాణి, రానా సందడి చేశారు.

తాజాగా ఈ షోలో లైగర్ చిత్రయూనిట్ (Liger Team) సందడి చేసింది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి (Charmi), విజయ్ దేవరకొండ అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‏ను సంక్రాంత్రి కానుకగా జనవరి 14న టెలికాస్ట్ చేయనున్నారు. ఈ షోలో బాలయ్య పంచె కట్టుతో మెరిశారు. 

Also Read: Jai Balayya song : అఖండ మూవీ నుంచి జై బాలయ్య సాంగ్ ఫుల్‌ వీడియో వచ్చేసింది.

ప్రోమో ఓపెన్ చేస్తే... ముందుగా పైసా వసూలు సాంగ్‌తో ఇంట్రడక్షన్ ఇచ్చారు బాలయ్య. ఈ సందర్భంగా  మాటల గన్​ అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్​ను (Puri Jagannadh) పొగిడారు బాలకృష్ణ. ఇక వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలోని తేడా సింగ్ పాత్ర గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య  పూరీని లయన్ అని.. ఛార్మిని టైగర్ అని.. మీ ఇద్దరినీ కలిపితే.. ‘లైగర్’ అని చెప్పారు. దీంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ షోలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో (Vijay devarakonda) బాలయ్య కొంచెం ఫన్నీగా బాక్సింగ్ చేసారు. ఈ సందర్భంగా బాలయ్య (Balakrishna).. సమరసింహా రెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి అంటూ విజయ్ దేవరకొండను సాదరంగా ఆహ్వానించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News