బాలయ్య బాబు-బోయపాటి శ్రీను కాంబోలో సినిమా లాంచింగ్

టాలీవుడ్ సినీ పరిశ్రమలో బాలయ్య బాబు-బోయపాటి శ్రీనుల కాంబినేషన్ అంటే ఆ సినిమా ఎంత ఆసక్తికరంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Last Updated : Mar 17, 2018, 09:59 AM IST
బాలయ్య బాబు-బోయపాటి శ్రీను కాంబోలో సినిమా లాంచింగ్

టాలీవుడ్ సినీ పరిశ్రమలో బాలయ్య బాబు-బోయపాటి శ్రీనుల కాంబినేషన్ అంటే ఆ సినిమా ఎంత ఆసక్తికరంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబుకు బోయపాటి అందించిన బ్లాక్ బస్టర్ లెజెండ్ సినిమా ఎంత హిట్టయ్యిందో టాలీవుడ్ ఆడియెన్స్‌కి అందరికీ సుపరిచితమే. అలాగే ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లయన్ సినిమా బాలయ్య బాబు అభిమానులకి మరో సూపర్ హిట్‌ని అందించింది. అందుకే ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోంది అంటే అది ఆ ఇద్దరి అభిమానులకి పండగ లాంటిదే అనుకోవాలి మరి. లెజెండ్, లయన్ సినిమాల తర్వాత మళ్లీ ఈ సేమ్ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఎదురుచూస్తోన్న వారికి గుడ్ న్యూస్ ఇది. 

స్వర్గీయ నందమూరి తారక రామారావు రియల్ స్టోరీ ఆధారంగా మార్చి 29న ఎన్టీఆర్ టైటిల్‌తో ఓ బయోపిక్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న బాలయ్య బాబు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే బోయపాటి దర్శకత్వంలో తన సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు బాలయ్య బాబు. జూన్ 10వ తేదీన బాలయ్య బాబు 58వ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా లాంచ్ కానుంది. ఆగస్టులో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

బోయపాటి శ్రీనుతో సినిమా తర్వాత పూరి జగన్నాథ్, ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రెండు సినిమాలు రెండు రెడీగా వున్నాయి.  

Trending News