Bade Miyan Chote Miyan OTT: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన 'బఢేమియా ఛోటే మియా'..

Bade Miyan Chote Miyan OTT:  బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడేమియా ఛోటేమియా’.ఉగాది, రంజన్ పండగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 6, 2024, 12:33 PM IST
Bade Miyan Chote Miyan OTT: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన 'బఢేమియా ఛోటే మియా'..

Bade Miyan Chote Miyan OTT: బీటౌన్ హిట్ మిషన్ అక్షయ్ కుమార్ వరుస సినిమాలు చేయడంలో ముందుంటారు. ఈ కోవలో ఈ యేడాది ఆయన హీరోగా నటించిన మూవీ ‘బడే మియా ఛోటేమియా’. టైగర్ ఫ్రాఫ్ ఈ మూవీలో ఛోటే మియా పాత్రలో నటించారు. ఈద్ పండగ సందర్భంగా రిలీజైన ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది. రొటీన్ స్పై రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ గా విజయం సాధించలేదు. గత కొన్నేళ్లుగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చిన బాలీవుడ్ ఖిలాడీ ఈ సారి తన మార్క్ యాక్షన్ డ్రామా మూవీతో పలకరించినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు.
గతంలో ఇదే పేరుతో బిగీ బీ, గోవిందా హీరోలుగా వచ్చిన 'బడేమియా ఛోటేమియా' బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాదాపు 25 యేళ్ల తర్వాత  టైటిల్‌ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పేరుకు తగ్గట్టు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు.

తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో  ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా హిందీతో పాటు ప్యాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాను బాలీవుడ్‌లో సుల్తాన్, టైగర్ జిందా హై వంటి సినిమాలను దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జఫర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వశు భగ్నానీతో పాటు ఇతరులు ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు.
ఈ చిత్రంలో అక్కీ, టైగర్ ష్రాఫ్ మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ పాత్రలో మెప్పించారు. అటు హీరోయిన్స్‌గా సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ యాక్ట్ చేశారు. హై ఓల్టెజ్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్స్ లో చూడని వాళ్లు ఎంచక్కా నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News