Ayodhya Sri Ram: ప్రవాస భారతీయుడు భక్తి పూర్వక సమర్పణలో విడుదలైన 'అయోధ్య శ్రీరామ్' ఆల్బమ్.. సోషల్ మీడియాలో వైరల్..

Ayodhya Sri Ram Album : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంలో  బాల రాముడిగా శ్రీరామ చంద్రుడు కొలువు తీరడంతో కోట్లాది హిందూవుల చిరకాల కోరిక నెరవేరినట్టైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆ శ్రీరామ చంద్రున్ని కీర్తిస్తూ పలు భజనలు, కీర్తనలను రచిస్తూ.. రామ భక్తుల్లో ఉత్సాహాం నింపుతున్నారు. తాజాగా ఈ కోవలో మరో NRI ప్రముఖుడు అయోధ్యలో శ్రీరాముడిపై ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి విడుదల చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 03:21 PM IST
Ayodhya Sri Ram: ప్రవాస భారతీయుడు భక్తి పూర్వక సమర్పణలో విడుదలైన 'అయోధ్య శ్రీరామ్' ఆల్బమ్.. సోషల్ మీడియాలో వైరల్..

Ayodhya Sri Ram Album ఆది పురుషుడు మర్యాద పురుషోత్తముడు అయోధ్య రామయ్యపై అవ్యాజ్యమైన భక్తితో.. "అయోధ్య శ్రీరామ్" పేరుతో ఆయనపై ఒక ప్రత్యేక ఆల్బమ్ రూపొందించారు ప్రవాస భారతీయులు "సమీర్ పెనకలపాటి". త్వరలో ఈయన సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సమీర్ పెనకలపాటి "ఎస్.పి.ప్రొడక్షన్ హౌస్" పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి... "అయోధ్య శ్రీరామ్"తో ఈ బ్యానర్ కు శ్రీకారం చుట్టారు.

ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది హిందువుల 500 సంవత్సరాల ఆకాంక్ష అయిన "అయోధ్య రామ మందిరం" విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన చారిత్రక సందర్భంలో "అయోధ్య శ్రీరామ్" ఆల్బమ్ విడుదల చేశారు సమీర్. యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ సారధ్యంలో అచంచల భక్తి శ్రద్ధలతో రూపొందిన "అయోధ్య శ్రీరామ్" గీతాన్ని సత్య కశ్యప్‌తో కలిసి... చిన్మయి, స్నిఖిత, శ్రాగ్వి ఆలపించారు. తెలుగులో ఈ గీతానికి 'చిరంజీవి ఎన్ని' సాహిత్యం సమకూర్చగా... హిందీలో తన్వీర్ ఘజ్వి రాశారు. "యువర్స్ ఉన్ని" ఈ ఆల్బమ్ కు ఎడిటర్‌గా వ్యవహరించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News