Venuswamy on Prabhas: 2023 నుంచి దారుణంగా ప్రభాస్ పరిస్థితి.. వేణు స్వామి సంచలన కామెంట్లు!

Astrologer Venuswamy on Actor Prabhas Health: నటుడు ప్రభాస్ జాతకం 2023 నుంచి మరింత దారుణంగా ఉండనుందని జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 28, 2022, 03:27 PM IST
Venuswamy on Prabhas: 2023 నుంచి దారుణంగా ప్రభాస్ పరిస్థితి.. వేణు స్వామి సంచలన కామెంట్లు!

Astrologer Venuswamy Sensational Revealation on Actor Prabhas Health: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇటీవల కాలంలో అనేకమంది సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాల గురించి చెబుతూ హాట్ టాపిక్ గా మారుతున్న వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆరోగ్యం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రభాస్ అనారోగ్యం గురించి తమకు తెలిసిందని ఈ మధ్య కొన్ని వీడియోస్ లో అయితే పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో కూడా ప్రభాస్ కనిపిస్తున్నాడని ఆయన జాతకంలో అసలు ఏముంది? ఆయన జాతకం ఎలా ఉంది? అని ప్రశ్నించారు. దానికి వేణు స్వామి ఆసక్తికరంగా స్పందించారు .వాస్తవానికి తాను సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలని అనుకోను కానీ జాతకరీత్యా వారి పర్సనల్ జీవితాలు ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి అనే విషయాన్ని చెబుతానని అన్నారు.

ఇక విజయ్ దేవరకొండ గురించి, రష్మిక మందన్న గురించి, నాగచైతన్య, సమంత వివాహం గురించి, రామ్ చరణ్- ఉపాసన సంతానం గురించి తాను ఎనిమిదేళ్ల క్రితమే చెప్పానని అయితే అవన్నీ ఆలస్యంగా జరిగినప్పుడు అవి నిజమని తేలతాయని అన్నారు. తాను చెప్పిన సమయంలో తనను విమర్శిస్తారు కానీ అక్కడ ఎంత నిజం ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అభిమానులు ప్రయత్నించరు అని వేణు స్వామి పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 
 

Trending News