రజనీ 2.0లో అమీజాక్సన్ ఫస్ట్ లుక్ విడుదల

                    

Last Updated : Oct 12, 2017, 03:23 PM IST
రజనీ 2.0లో అమీజాక్సన్ ఫస్ట్ లుక్ విడుదల

రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 2.0 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అమీ జాక్సన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్‌లో అమీ జాక్సన్ విభిన్నమైన లుక్‌తో కనిపించడం విశేషం. అమీ జాక్సన్‌కి సంబంధించిన ఈ పోస్టర్‌ను దర్శకుడు శంకర్ ఈ రోజే తన ట్విటర్ పేజీ ద్వారా పంచుకున్నారు. 2.0 చిత్రం ఇప్పటికే హాలీవుడ్ స్టైల్‌లో ఉందని పలువురి ప్రముఖుల ద్వారా పాజిటివ్ కామెంట్లను కూడా పొందడం గమనార్హం. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 25 జనవరి 2018న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీల్లో కూడా డబ్ చేయబోతున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చడం విశేషం. 

 

 

Trending News