రాజకీయాల్లోకి వచ్చేదే లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టంచేశారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, దయచేసి తనను ఒత్తిడి చేయొద్దంటూ అభిమానులకు రజనీకాంత్ (Rajinikanth) విజ్ఞప్తి చేశారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఈ రోజు అపోలో వైద్యులు (Rajinikanth hospitalised) డిశ్చార్జ్ చేశారు.
రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని (Rajinikanth hospitalised) నిపుణులైన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొలగిపోయింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తలైవా పార్టీ పెడతారా లేక మరెదైనా పార్టీలోకి చేరుతారా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.. అనే పలు ఊహాగానాలకు చెక్ పెడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.
రజినీకాంత్.. సగటు ప్రేక్షకులు సూపర్ స్టార్ అంటారు... అభిమానులు తలైవా అని పిలుచుకుంటారు. ఇలా ఎవరు ఏ పేరుతో పిలిచినా... భారత సినిమాకు సంబంధించి ఆయన పరిచయం అక్కరలేని వ్యక్తి. అవును.. తమిళ సినిమా నుంచి నటుడిగా మొదలైన ఆయన.. ఇంతింతై వటుండితై అన్నట్లు భారత సినీ పరిశ్రమ గర్వించే స్థాయికి ఎదిగారు. అంతర్జాతీయంగానూ పేరు ప్రతిష్టలు, అభిమానులను సంపాదించుకున్నారు. ఆయనే.. సూపర్ స్టార్ రజనీకాంత్... నేడు ఆయన పుట్టిన రోజు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంగా ఉన్నారని.. పలు రుగ్మతలతో బాధపడుతున్నారని వస్తున్న పుకార్లను ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమాన సంఘాల నాయకులు ఖండించారు.
"కాలా" సినిమా మనకు మానవులు మానవుల వలే ఆలోచించాలనే సందేశాన్ని ప్రేమతో అందిస్తోంది. మానవుడు కేవలం మానవుడే తప్పితే ఏదో గొప్ప అవతారం కాదన్న సత్యాన్ని కూడా చెబుతుంది. ఇది ఒక సామాన్యుడి తర్కం. అంతేకాదు.. ఒక నమ్మకం, విశ్వాసానికి సంబంధించిన కథ ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.