Pushpa The Rule First Look : దటీజ్ పుష్ప రాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. ఫస్ట్ లుక్ దెబ్బకు రికార్డులు బద్దల్

Pushpa The Rule First Look అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి నిన్న వచ్చిన అప్డేట్లు దేశాన్ని ఊపేశాయి. వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన వీడియో, ఆ తరువాత వచ్చిన కాళీ మాత అవతారానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 06:20 PM IST
  • నెట్టింట్లో పుష్ప రాజ్ హంగామా
  • బన్నీ బర్త్ డే సెలెబ్రేషన్స్ రెట్టింపు
  • కాళీ మాాతా అవతారంతో బన్నీ రికార్డ్‌లు
Pushpa The Rule First Look : దటీజ్ పుష్ప రాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. ఫస్ట్ లుక్ దెబ్బకు రికార్డులు బద్దల్

Pushpa The Rule First Look Record అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో.. బాక్సాఫీస్ వద్ద సునామిలా దూసుకుపోయిందో అందరికీ తెలిసిందే. నార్త్ బెల్ట్‌లో డబ్బింగ్ సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టేశాడు బన్నీ. అలా పుష్ప రాజ్ దెబ్బకు బాలీవుడ్ హడలిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్‌తో దేశాన్ని ఊపేందుకు బన్నీ రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప, పుష్ప రాజ్ ఫస్ట్ లుక్‌లకు విశేషమైన స్పందన వచ్చింది.

Also Read:  "Where is Pushpa": బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. వేర్ ఈజ్ పుష్ప అంటూ అంచనాలు పెంచిన సుకుమార్

అసలే బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. రికార్డుల విషయంలో వస్తే బన్నీ ఫ్యాన్స్ దూకుడు మీదుంటారు. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్‌లో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అయితే పుష్ప రాజ్‌గా బన్నీ కనిపించిన తీరుకు మరోసారి అంతా ఫిదా అయ్యారు. వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన వీడియోలో పులితో షాట్ పెట్టిన తీరుకు, బన్నీ కనిపించిన విధానానికి అంతా అవాక్కయ్యారు.

ఇక కాళీ మాతా అవతారంలో బన్నీని సుకుమార్ చూపించిన విధానం, బన్నీ మేకోవర్ అన్నీ కూడా అద్భుతంగా సెట్ అయ్యాయి. అందుకే ఈ ఫస్ట్ లుక్‌కు, ఆ వేర్ ఈజ్ పుష్ప వీడియోకు సోషల్ మీడియాలో కొత్త రికార్డులు వచ్చిపడ్డాయి. ట్విట్టర్‌లో 207k, ఇన్ స్టాగ్రాంలో 5M, ట్విట్టర్‌లో 850K లైక్స్‌తో మోస్ట్ లైక్డ్ ఫస్ట్ లుక్‌గా నిలిచింది.

ఇక వేర్ ఈజ్ పుష్ప వీడియోకు అయితే అన్ని భాషల్లో కలిపి యాభై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రెండు మిలియన్లకు పైగా లైక్స్‌తో బన్నీ తన హవాను చూపిస్తున్నాడు. ఈ సారి పక్కా వెయ్యి కోట్ల బొమ్మ అని బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. బన్నీ బర్త్ డేకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి హీరో హీరోయిన్లు విషెస్ చెబుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Pushpa The Rule New Poster : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ట్.. అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News