Akshay Kumar - Priyadarshan: 14 యేళ్ల తర్వాత స్టార్ హీరో.. డైరెక్టర్ కాంబోలో మూవీ.. ఈ సారి అంతకు మించి..

Akshay Kumar - Priyadarshan:  సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో ఓ సినిమా సూపర్ హిట్టైయితే.. ఆ కాంబోలో మరో సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్‌లో అదే తరహాలో మరో కాంబోకు 14 యేళ్ల తర్వాత రంగం సిద్దమైంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 27, 2024, 10:51 AM IST
 Akshay Kumar - Priyadarshan: 14 యేళ్ల తర్వాత స్టార్ హీరో.. డైరెక్టర్ కాంబోలో మూవీ.. ఈ సారి అంతకు మించి..

Akshay Kumar - Priyadarshan: బాలీవుడ్ ఖిలాడిగా యాక్షన్ హీరోగా చెలరేగిపోతున్న టైమ్‌లో.. ఆయన ఇమేజ్‌ మార్చిన దర్శకుడు ప్రియదర్శన్. యాక్షన్ కింగ్‌గా సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్న అక్షయ్ కుమార్‌లోని కామెడీ యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడిగా ప్రియదర్శన్‌కు మంచి పేరు ఉంది. ఆ తర్వాత హిందీలో అక్షయ్ కుమార్‌తో దే ధనాధన్, భాగంభాగ్, గరం మసాలా, భూల్ భులయ్యా, ఖట్టా మీటా వంటి పలు కామెడీ సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. దాదాపు 14 యేళ్ల తర్వాత ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు.

ఈ సారి కూడా వీళ్ల కాంబినేషన్‌లో ఓ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌ రాబోతుంది. ఈ విషయాన్ని ప్రియదర్శన్‌తో పాటు అక్షయ్ కుమార్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  వెల్లడించారు. ఈ సారి వీళ్ల కాంబినేషన్‌లో వచ్చే చిత్రం హార్రర్, కామెడీ కమ్ ఫాంటసీ అంశాలతో తెరకెక్కబోతుందట.
 
ఈ సినిమాను ఏక్తా కపూర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రియదర్శన్.. రామ్ మందిర్‌కు సంబంధించిన ఓ డాక్యుమెంటరీ
తీసే పనిలో ఉన్నాడట. త్వరలో ఈ డాక్యుమెంటరీ పూర్తి కానుంది. మరోవైపు అక్షయ్ కుమార్‌తో చేయబోతున్న చిత్రంలో మన దేశంలోని మూఢనమ్మకాలు.. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. ఇక వీళ్ల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరోవైపు అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. రీసెంట్‌గా 'బడేమియా ఛోటేమియా' మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్‌ మరో హీరోగా నటించారు. అలీ అబ్బాస్ జఫర్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.

Also Read: Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News