Protest In Chhattisgarh Against Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ జంటగా నటించిన మూవీ ఆదిపురుష్. ఈ నెల 16న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చిన.. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే మొదటి రోజుతో పోలిస్తే.. రెండో రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయి. తొలి రోజు రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టగా.. రెండో రోజు రూ.80 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాపై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. రామాయణం వక్రీకరించి తీశారంటూ పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని నిరసనకారులు పేర్కొంటూ 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శనపై జాతీయ స్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలో శనివారం నిరసన ప్రదర్శన నిరసన తెలిపారు. 'కొరియా సాహిత్య అవమ్ కళా మంచ్' సభ్యులు మనేంద్రగఢ్ పట్టణంలోని కాంప్లెక్స్‌కు చేరుకుని సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ ముందు ఆందోళన చేశారు. మంచ్ సభ్యురాలు అనామికా చక్రవర్తి మాట్లాడుతూ.. 'ఆదిపురుష్' అనే పేరు తప్పుదారి పట్టించేలా ఉందని అన్నారు.
"రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 'మర్యాద పురుషోత్తముడు' ఆదిపురుషుడు కాదు. ఈ చిత్రం సమాజానికి చాలా తప్పుడు సందేశాన్ని పంపుతోంది. మన యువ తరాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఈ చిత్రం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన కథాంశం" అని ఆమె ఆరోపించారు. తక్షణమే దేశంలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సినిమాలో రావణుడు, హనుమంతుడు పాత్రలను చిత్రీకరించిన తీరు సిగ్గుచేటని మండిపడ్డారు.
అంతకుముందు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆదిపురుష్ మూవీపై స్పందించారు. సినిమాలో రాముడు, హనుమంతుడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని అన్నారు. ప్రజలు కోరితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిపురుష్‌ను రాష్ట్రంలో నిషేధించే ఆలోచన చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నడము ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ సినిమా.. అంచనాలకు అందుకోలేకపోయిందనే చెప్పాలి. పేలవమైన వీఎఫ్ఎక్స్, పాత్రల చిత్రీకరణపై భారీ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.
Also Read: Adipurush Collections: ఆదిపురుష్ మూవీ టీమ్‌కు షాక్.. అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు క్యాన్సిల్స్
Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook