Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!

Nassar: సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. సినీ నటుడు నాజర్‌కు గాయాలయ్యాయి. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 17, 2022, 06:50 PM IST
  • సినిమా షూటింగ్‌లో అపశృతి
  • సినీ నటుడు నాజర్‌కు గాయాలు
  • ఆస్పత్రికి తరలింపు
Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!

Nassar: ప్రముఖ సినీ నటుడు నాజర్‌కు గాయాలయ్యాయి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో షూటింగ్ జరుగుతుండగా ఘటన జరిగింది. నటులు సుహాసిని, మెహ్రీన్, శియాజి షిండేలతో షూటింగ్ జరుగుతోంది. ఈక్రమంలో నటుడు నాజర్ గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. గతకొంతకాలంగా హైదరాబాద్‌లో తమిళ్ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు గుర్తించారు.

మెట్లపై నుంచి దిగుతున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఆయన ఎడమ కన్ను కింద కణతి భాగంలో స్వల్ప గాయమైనట్లు వైద్యులు తెలిపారు. దీని వల్ల రక్తస్రావం జరిగిందన్నారు. దక్షిణాదిలో విలక్షణ నటుడిగా నాజర్ పేరు పొందారు. స్టార్‌ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాల్లో కీలక రోల్‌లో నటించారు. పెద్ద హీరోలకు ధీటుగా నాజర్ నటించారు. తండ్రిగా, పోలీసుగా, విలన్‌గా, కామెడియన్‌గా వివిధ పాత్రలను పోషించారు. ఐతే ఇటీవల ఆయన సినిమాలను తగ్గించారు. ఒకటి రెండు మూవీల్లోనే నటిస్తున్నారు. వయసు రిత్యా సినిమాలను చేయడం లేదని ఇటీవల నాజర్ ప్రకటించారు. ఈక్రమంలోనే ఆయన గాయపడ్డారు. 

Also read:Union Govt: రైతన్నలకు గుడ్‌న్యూస్..రుణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Also read:CM Kcr: దేశాన్ని విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయి..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News