Actor Chalapathi Rao Passed Away: టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇదే ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించగా ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇక కొద్దిరోజుల ముందే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కూడా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా నిన్ననే జరిగాయి, ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో సీనియర్ నటుడు కన్నుమూసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా అనేక వందల సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు చలపతిరావు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున ఆయన బంజారాహిల్స్ నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. తన సుధీర్గ సినీ కెరీర్ లో 1200 సినిమాల్లో ఆయన నటించినట్లుగా తెలుస్తోంది.
చలపతిరావుకి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా అందరికీ పరిచయమే. 1944 మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే నటుడిగా నిలదొక్కుకున్నారు.
ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాల్లోనే ఆయన అవకాశాలు అందిపుచ్చుకొని ఆ తర్వాత నటుడిగా తనదంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుచుకున్నారు. వయసు పైబడిన రీత్యా చాలాకాలంగా ఆయన నటనకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కానీ ఇప్పుడు పూర్తిగా నటనకు దూరమైనట్లుగానే చెప్పాలి. ఆయన మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: Viral Video: బుడ్డోడి చాకచక్యం.. తల్లిని కాపాడిన వీడియో వైరల్, చూస్తే ఔరా అనాల్సిందే
Also Read: Tunisha Sharma Suicide: సహనటుడి మేకప్ రూంలో 20 ఏళ్ల సినీ నటి సూసైడ్.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.