Karnataka:రూ. 49 కే 4 డజన్ల గుడ్లు.. టెంప్టింగ్ ఆఫర్ కు పోతే షాకింగ్ ట్విస్ట్... అసలు స్టోరీ ఏంటంటే..?..

Viral News: ఒక కంపెనీ సోషల్ మీడియాలో కేవలం రూ. 49కే 4 డజన్ల కోడి గుడ్లు అంటూ ఓ ప్రకటను ప్రకటించింది. ఇది కాస్త బెంగళూరుకు చెందిన ఒక మహిళ దీన్ని చూసింది. వెంటనే ఆఫర్ చూసి కక్కుర్తి పడింది. వెంటనే ఎలా గైన కొనేయాలని ఆన్ లైన్ ప్రాసెస్ ను పూర్తి చేసింది.

Last Updated : Feb 26, 2024, 08:10 PM IST
  • ఆన్ లైన్ లో గుడ్లమీద ఊహించని ఆఫర్..
  • ఆన్ లైన్ లో కొనేందుకు ప్రయత్నించిన మహిళ..
Karnataka:రూ. 49 కే 4 డజన్ల గుడ్లు.. టెంప్టింగ్ ఆఫర్ కు పోతే షాకింగ్ ట్విస్ట్... అసలు స్టోరీ ఏంటంటే..?..

Fake Discount On Eggs Fraud In Bengaluru: టెక్నాలజీలో రంగంలో ప్రతిరోజు అనేక మార్పులు వస్తున్నాయి. కొందరు సాంకేతిక రంగంను మంచి కోసం ఉపయోగించుకుంటే, మరికొందరు మాత్రం తప్పుడు పనులకు ఉపయోగించుకుంటున్నారు. రోజు ఆన్ లైన్ మోసాలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. మీకు ల్యాటరీ వచ్చిందని, ఓటీపీ చెప్పాలని, ఫెక్ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసిన వాళ్లను మాటల్లో ఉంచేసి అడ్డంగా మోసం చేస్తున్న ఘటనలు కొకొల్లలు.

Read More: Vaani Kapoor hot pics: హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తోన్న వాణి కపూర్, పిక్స్ వైరల్

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఏంటంటే ఇలాంటి వాటిలో మోసపోతున్న వారు చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నట్లు కొన్ని సర్వేలలో తెలిసింది. సోషల్ మీడియాలో, మెయిల్స్ లలో తక్కువ ధర అనగానే చాలా మంది టెంప్ట్ అయిపోతుంటారు. తీరా దాన్ని క్లిక్ చేసిన తర్వాత డబ్బులు గుల్లకాగానే కుయ్యో.. మోర్రో అని మొత్తుకుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

కర్ణాటకలోని బెంగళూరు కుచెందిన ఒక మహిళకు మెయిల్ వచ్చింది. కేవలం  రూ. 49కే 4 డజన్ల కోడి గుడ్లు అని ఒక యాడ్ వచ్చింది. ఇది చూడగానే ఆమె కక్కుర్తి పడింది. ఇంకేముంది.. వెంటనేయాడ్ ను క్లిక్ చేసి.. ఆన్ లైన్ ప్రాసెస్ లోకి దూరిపొయింది. ఆమె క్రెడిట్ కార్డు వివరాలను ఆ లింక్ లో వేసింది.

Read More: Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..

ప్రాసెస్ అంతా పూర్తికాగానే ఆమె ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలని వచ్చింది. దీని ప్రకారం ఆమె ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసింది. అప్పుడు ఒక్కసారిగా ఆ మహిళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అక్కడ రూ. 49 కాకుండా క్రెడిట్‌ కార్డ్‌ నుంచి ఏకంగా రూ. 48,199 డెబిట్ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో షాక్ కు గురైన మహిళ.. మోసపోయినట్లు గ్రహించి వెంటనే సైబర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News