Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి

Citizen Dies In Freak Accident Involving Shobha Karandlaje Car: కేంద్ర మంత్రి ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనతో ప్రచారం కాస్త అంతిమయాత్రగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 8, 2024, 08:38 PM IST
Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి

Shobha Karandlaje: దేశమంతా లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరున సాగుతోంది. పెద్ద ఎత్తున పార్టీల నాయకులు ప్రచారం చేస్తుండగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ కేంద్ర మంత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి కారు డోర్‌ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

Also Read: Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి మళ్లీ తప్పిన ప్రమాదం.. నెలలో ఇది రెండోసారి

 

బెంగళూరు నార్త్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం బెంగళూరులోని కేఆర్‌పురంలో పర్యటించారు. ప్రచారం చేస్తున్న క్రమంలో రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా డ్రైవర్‌ కారు తలుపు తెరిచాడు. దీంతో వెనుకాల ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ బీజేపీ కార్యకర్త కిందపడిపోయాడు. డోర్‌ తగిలి బైక్‌ కిందపడగా.. ఆ వెనుకాలే వస్తున్న బస్సు కార్యకర్తపై నుంచి వెళ్లింది. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనలో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మృతుడు ప్రకాశ్‌ (62)గా గుర్తించారు. బీజేపీ కార్యకర్తగా కొనసాగుతున్నాడు.

Also Read: Mahakaleshwar Temple: ప్రముఖ ఆలయంలో అమ్మాయిల రచ్చ రచ్చ.. 'రీల్స్‌' వద్దన్న సెక్యూరిటీపై దాడి

వెంటనే అక్కడి స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రకాశ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ తప్పిదంతోనే ఈ ఘోరం జరిగిందని పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్‌తోపాటు బస్సు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదం సమయంలో కారులో కేంద్ర మంత్రి శోభ కరంద్లాజె లేరు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఆమె ఘటనపై విషాదం వ్యక్తం చేశారు. 'ప్రకాశ్‌ నిబద్ధత కల పార్టీ కార్యకర్త. ఎల్లప్పుడూ పార్టీకి పని చేస్తుండేవాడు. అతడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. అతడి కుటుంబానికి అండగా ఉంటా' అని కేంద్ర మంత్రి శోభ హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి సహాయం చేస్తామని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News