WhatsApp to Stop Some Phones: నవంబర్ 1 నుంచి ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు!

WhatsApp new Update: ఇన్​స్టాంట్ మేసేజింగ్ సేవల సంస్థ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్​తో పని చేసే పలు పాత ఫోన్లలో వచ్చే నెల నుంచి సేవలు నిలిపేయాలని నిర్ణయించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 07:15 PM IST
  • నవంబర్ 1 నుంచి పలు ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్
  • వాట్సాప్ ఆగిపోనున్న ఫోన్ల జాబితాలో విడుదల
  • గతంలో కూడా పలు మొబైళ్లలో సేవల నిలిపివేత
WhatsApp to Stop Some Phones: నవంబర్ 1 నుంచి ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు!

WhatsApp to stop working on these Phones: ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్​డేట్స్​తో యూజర్లకు (WhatsApp new Updates) సేవలను అందించే వాట్సాప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పలు మోడల్స్​లో సేవలు నిలిచిపోనున్నాయి.

నవంబర్ 1 నుంచే వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం అమలులోకి (WhatsApp stop working some phones) రానుంది.

అయితే వాట్సాప్ పని చేయని ఫోన్ల జాబితాలో మీరు వాడుతున్న మొబైల్ ఉంటే.. నవంబర్ 1 లోపే అందులోని డేటాను ట్రాన్స్​ఫర్ చేసుకోవడం ఉత్తమం. డేటా ట్రాన్స్​ఫర్ చేసుకోకుకన్నా.. మెయిల్​కు సింక్ చేసుకోవచ్చు. దీని ద్వారా వేరే మొబైల్​లో ఇదే ఫోన్​ నంబర్​తో వాట్సాప్​లోకి లాగిన్ అయినా..ఇందులోని డేటాను యాక్సెస్ చేసే వీలుటుంది.

Also read: Microsoft passes Apple: యాపిల్​ను దాటేసి అత్యంత విలువైన లిస్టెడ్​ కంపెనీగా మైక్రోసాఫ్ట్​

Also raad: Petrol Price today: దేశంలో ఆగని పెట్రో మంట - రికార్డు స్థాయికి ధరలు

ఓఎస్​ల వారీగా..

ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఓఎస్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలోవాట్సాప్ సేవలు నంబర్ 1 నుంచి నిలిచిపోనున్నాయి. 

ఐఓఎస్‌ 9, కాయ్‌ 2.5.1 వెర్షన్‌ ఫోన్లలో కూడకా వాట్సాప్ నంబర్ 1 తర్వాత పని చేయదు. ప్రస్తుతం పాత ఓఎస్​లతో పని చేస్తున్న ఫోన్ల జాబితాను కూడా వాట్సాప్ అందుబాటులో ఉంచింది.

Also read: JioPhone Next: జియోఫోన్ నెక్ట్స్​ గురించి బిగ్ అప్​డేట్​- ధర, ఫీచర్ల వివరాలు వెల్లడి

Also read: EPF interest: ఈపీఎఫ్​ఓ చందాదారులకు గుడ్​ న్యూస్​- త్వరలోనే ఖాతాల్లో వడ్డీ జమ!

వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న ఫోన్ మోడల్స్ ఇవే..

శాంసంగ్​ గెలాక్సీ ట్రెండ్ లైట్​, గెలాక్సీ ట్రెండ్ 2, గెలాక్సీ ఎస్​2, గెలాక్సీ ఎస్​3 మిని, గెలాక్సీ ఎక్స్​ కవర్ 2, గెలాక్సీ కోర్​, గెలాక్సీ ఏస్​ వంటివి  శాంసంగ్​లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న ఫోన్​ మోడల్స్​.
సోలీ మొబైల్స్​లో చూసుకుంటే.. సోనీ ఎక్సీపీరియా మిరో, సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్‌, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్‌ ఎస్‌ వంటి మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

వీటితో పాటు.. చైనాకు చెందిన హువావే, జెడ్​టీఈ ఫోన్ మోడల్స్​ కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న ఫోన్ల జాబితాలో ఉన్నాయి. అయితే ఆ ఫోన్​ మోడల్స్​ను దేశీయంగా అంతగా వాడటం లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.

యాపిల్ ఫోన్లలో మాత్రం ఓఎస్ 9 కన్నా తక్కువ వెర్షన్ ఉంటే.. వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఒకవేళ ఓఎస్​ వెర్షన్​ను అప్​డేట్ చేసుకునే సదుపాయం ఉంటే అవే ఫోన్లలో వాట్సాప్ వాడుకోవచ్చు.

వీటన్నింటితో పాటు.. పలు ఫీచర్ ఫోన్లలో ఉన్న వాట్సాప్ సేవలను కూడా అక్టోబర్ 31 తర్వాత నిలిచిపోనున్నాయి.

వాట్సాప్ ఇంతకు ముందు కూడా.. ఇలానే వివిధ పాత మోడల్ ఫోన్లలో ససేవలు నిలిపివేసింది. ఇక విండోస్ ఫోన్లకైతే 2020 జనవరి 1 నుంచి పూర్తిగా సేవలు ఆపేసింది వాట్సాప్​.

Also read: RBI Governor: ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం పొడగింపు- మరో మూడేళ్లు సేవలు!

Also read: LPG Price hike: మరోసారి వంట గ్యాస్ ధరల మంట- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News