Tecno Pop 5 LTE: జియో స్మార్ట్ ఫోన్ కు పోటీగా భారత మార్కెట్లోకి Tecno మొబైల్స్ కొత్త వేరియంట్

Tecno Pop 5 LTE: ఇండియా మార్కెట్లోకి Tecno మొబైల్స్ కు సంబంధించిన కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. JioPhone Next కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండడం సహా దాని కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండడం ఈ స్మార్ట్ ఫోన్ విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ యాప్ లో అందుబాటులోకి రానుంది. ఇంకెందుకు ఆలస్యం దాని వివరాలేంటో తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 02:38 PM IST
    • భారత మార్కెట్లోకి Tecno మొబైల్ కొత్త వేరియంట్
    • జియో నెక్స్ట్ కు పోటీగా Tecno Pop 5 LTE వర్షెన్
    • జనవరి 16 నుంచి అమెజాన్ లో విక్రయం
Tecno Pop 5 LTE: జియో స్మార్ట్ ఫోన్ కు పోటీగా భారత మార్కెట్లోకి Tecno మొబైల్స్ కొత్త వేరియంట్

Tecno Pop 5 LTE: Tecno మొబైల్ ఎట్టకేలకు భారత మార్కెట్లో తమ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. Tecno POP 5 LTE అనే వేరియంట్ ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. Tecno మొబైల్స్ కు సంబంధించిన ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ ను పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో నవంబరు 2021లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఈ Tecno POP 5 LTE ధర ఇటీవలే జియో ప్రవేశ పెట్టిన JioPhone Next కంటే తక్కువగా ఉంది. దీంతో పాటు ఈ మొబైల్ ఫీచర్ల పరంగానూ చాలా అడ్వాన్స్ గా ఉంది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన వివరాలేంటే ఒకసారి తెలుసుకుందాం. 

ధర ఎంతంటే?

Tecno POP 5 LTE ధర రూ. 6299 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 16 నుంచి అమెజాన్ ఇండియాలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇందులో ఫోన్ ఐస్ బ్లూ, డీప్‌సీ లస్టర్, టర్కోయిస్ సియాన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అయితే మార్కెట్లో ఈ మొబైల్ కు పోటీగా ఉన్న JioPhone Next రూ.6,499 ధరకు అందుబాటులో ఉంది. 

Tecno POP 5 LTE వివరాలు

1) డిస్ ప్లే - 6.52-అంగుళాల డాట్-నాచ్ (1600 x 720 పిక్సెల్‌ HD+ రిజల్యూషన్‌)

2) డిస్ ప్లే రేషియో : 20: 9 యాస్పెక్ట్ రేషియో

3) టచ్ శాంప్లింగ్ రేట్ : 120 Hz

4) ప్రాసెసర్ : 2 GHz క్వాడ్-కోర్ MediaTek Helio A25 

5) ర్యామ్ : 2 జీబీ

6) స్టోరేజ్ : 32 జీబీ

7) కెమెరా : 8 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సల్ (ఫ్లాష్ లైట్ తో) 

8) బ్యాటరీ : 5000mAh

9) ఆండ్రాయిడ్ 11 గో వర్షెన్. 

Also Read: Amazon New Sale: అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​డే సేల్​ డేట్ వచ్చేసింది- పూర్తి వివరాలు ఇవే..

Also Read: Stock Market today: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర- 61 వేల మార్క్​పైకి సెన్సెక్స్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News