PhonePe processing fees: ఫోన్​పే షాకింగ్ నిర్ణయం- ఇక నుంచి మొబైల్ బిల్లులపై ఛార్జీల వసూలు!

PhonePe Charges: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సేవల అప్లికేషన్​ ఫోన్​పే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ యాప్​ ద్వారా చెల్లించే మొబైల్ బిల్లులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2021, 01:26 PM IST
  • మొబైల్ బిల్లులపై ఛార్జీ వసూలు
  • యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసినా రుసుము వర్తింపు
  • రూ.1-2 వరకు ఛార్జీలు
PhonePe processing fees: ఫోన్​పే షాకింగ్ నిర్ణయం- ఇక నుంచి మొబైల్ బిల్లులపై ఛార్జీల వసూలు!

PhonePe processing fees: వాల్​మార్ట్ గ్రూప్​నకు చెందిన ఆన్​లైన్​ పేమెంట్​ అప్లికేషన్​ ఫోన్​పే యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ రీఛార్జ్​ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (PhonePe Charges on Mobile recharge) చేస్తోంది. వాలెట్​తో పాటు.. యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసిన ఛార్జీలు వర్తిస్తాయని తెలిసింది. యూపీఐ ఆధారంగా పని చేసే యాప్​లలో.. ఛార్జీల వసూలు ప్రారంభించిన మొదటి అప్లికేషన్ ఫోన్​పేనే కావడం గమనార్హం.

ఛార్జీలు ఎంత?

రూ.50 నుంచి రూ.100 వరకు రీఛార్జ్​ చేస్తే ఒక రూపాయిని ఛార్జీగా వసూలు చేస్తుంది (PhonePe Charges) ఫోన్​పే. రీఛార్జ్ విలువ రూ.100 దాటితే.. రూ.2లను ఛార్జ్ చేయనుంది.
రు.50 కన్నా తక్కువ మొబైల్​ బిల్లులకు ఎలాంటి ఛార్జీలు ఉండనవి స్పష్టం చేసింది ఫోన్​పే.

ఫోన్​పేకు ఆదాయం ఎలా వస్తుంది?

ఫోన్​ పే సహా ఇతర ఇతర డిజిటల్ పేమెంట్ యాప్స్ (PhonePe income source)​ యూజర్లకు ఉచితంగానే సేవలందిస్తుంటాయి. కరెంట్​ బిల్లులు, రీఛార్జ్​లు, విమాన టికెట్ బుకింగ్స్ సహా వివిధ సేవలు వీటిలో ఉంచితంగానే పొందొచ్చు. అయితే ఈ సేవలందించడం ద్వారా నేరుగా యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోవు. కానీ.. మొబైల్ రీఛార్జ్ విషయంలో అయితే టెలికాం కంపెనీల నుంచి ఇతర పేమెంట్స్ విషయంలో ఆయా సంస్థల నుంచి కమీషన్ల రూపంలో ఆదాయాన్ని గడిస్తుంటాయి.
క్రెడిట్​ కార్డ్​ ద్వారా జరిపే లావాదేవీలకు.. ట్రాన్సక్షన్ విలువను బట్టి ఛార్జీలు వసూలు చేస్తుంటాయి ఆయా యాప్​లు.

దీనితో పాటు.. ఆయా యాప్​లను వినియోగించే యూజర్ల ఆర్థిక విధానాలు, కొనుగోలు సామర్థ్యం వంటి డేటా స్టోర్ అవుతుంది. ఈ డేటాను లక్ష్యిత వాణిజ్య ప్రకటనలకోసం విక్రయిస్తుంటాయి. దీని ద్వారా కూడా ఆయా యాప్​లను నిర్వహించే కంపెనీలకు ఆదాయం సమకూరుతుంటుంది. ఇప్పటి వరకు వాటికి ఇవే ప్రధాన ఆదాయ మార్గాలు. ఇప్పుడు తొలిసారి ఫోన్​పే యూజర్ల నుంచి ఛార్జీలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Also read: Swiggy leave offer: స్విగ్గీలో మహిళా ఉద్యోగులకు నెలకు రెండు పెయిడ్ లీవ్స్.. కారణం చెప్పాల్సిన అవసరం కూడా లేదు

Also read: Amazon prime Price hike: షాకిచ్చిన అమెజాన్​- 50 శాతం పెరగనున్న ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ ధరలు!

డిజిటల్​ పేమెంట్ మార్కెట్ ఇలా..

ప్రస్తుతం యూపీఐ ఆధారిత డిజిటల్​ పేమెంట్ సేవలందించే (Digital payment Market in India) విభాగంలో.. ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం వంటి యాప్​ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ సంస్థలన్ని ఆఫర్లు, స్క్రాచ్​ కార్డ్​ల వంటి ప్రమోషన్లతో యూజర్లను ఆకర్షిస్తుంటాయి.

డిజిటల్ పేమెంట్ మార్కెట్ విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరిలో గూగుల్​ పేను దాటి ఫోన్​ పే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. లావాదేవీల సంఖ్య, లావాదేవీల విలువ పరంగానూ ఫోన్​ పే తొలి స్థానంలో నిలిచింది. కరోనా తర్వాత ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్స్​వైపు మొగ్గు చూపడం కూడా ఈ యాప్​లకు కలిసొచ్చింది.

అయితే ఇప్పుడు ఫోన్​పే ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో యూజర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

 Also read: Petrol Price Hiked: వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ ధరల మోత- చెన్నైలో సెంచరీ కొట్టిన డీజిల్​

Also read: House Of Khaddar: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఖద్దర్‌ను లాంచ్ చేయనున్న కమల్ హాసన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News