Hyundai verna 2023 Car Booking Price: హ్యుందాయ్ కంపెనీ తమ కార్లను ఒక్కొక్కటిగా అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఇటీవలే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరాను అప్ డేట్ చేసి న్యూ లుక్ ల రిలీజ్ చేసిన హ్యూందాయ్.. ఇప్పుడు సెడాన్ కారు హ్యుందాయ్ వెర్నా 2023ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ కారు బుకింగ్ చేసుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న హ్యూందాయ్ కంపెనీ డీలర్స్ నుంచి లేదా కంపనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ సోమవారం నుంచే హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ కారు బుకింగ్ ప్రారంభమైంది.
2023 హ్యుందాయ్ వెర్నాలో కొత్తగా లభించే ఫీచర్స్ ఏంటి ?
కొత్త హ్యుందాయ్ వెర్నా నాలుగు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో ఆవిష్కృతమవుతోంది. కొత్త 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ అమర్చారు. దీంతోపాటుగా ఒక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటీ గేర్‌బాక్స్ కూడా ఎటాచ్ చేశారు. రెండు ఇంజన్లు RDE ఉద్గారాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఈ ఇంజన్స్ E20 ఇంధనంతో కూడా పని చేస్తాయి.
2023 హ్యుందాయ్ వెర్నా కలర్ ఆప్షన్స్
2023 వెర్నా నాలుగు మోడల్స్ లో లభించనుంది. అందులో ఒక వేరియంట్ EX కాగా మరొక వేరియంట్ S, ఇంకొకటి SX చివరి వేరియంట్ SX(O) పేరుతో లభించనుంది. కొత్త అప్‌డేటెడ్ వెర్నా ఏడు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తోంది. ఇందులో అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ అంటూ 3 కొత్త మోనోటోన్ కలర్స్ కూడా ఉండటం మరో విశేషం.
హ్యుందాయ్ వెర్నా కారు 16 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.6 లక్షల మంది హ్యుందాయ్ వెర్నా కార్లను కొనుగోలు చేశారు. అయితే, మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా ఇటీవల కాలంలో కస్టమర్ల ఫోకస్ సెడాన్ నుంచి ఎస్‌యువి కార్లపైకి మరలడంతో సెడాన్ కార్ల అమ్మకాలపై కొంతమేరకు ప్రభావం కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత తక్కువ ధరలో రెనో క్విడ్ RXE వేరియంట్..
ఇది కూడా చదవండి : Why Cars Catches Fire: కార్లలో మంటలు ఎందుకు వస్తాయో తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు
ఇది కూడా చదవండి : Highest Selling Car Brands: ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే
ఇది కూడా చదవండి : Maruti Cars Discount: కొత్తగా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మారుతి కార్లపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్.. ఫుల్ డీటేల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook