Honda Amaze Price Hike 2023: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆ కారు ధర.. కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి!

Amaze Price Hike 2023, Honda Amaze get costlier from 2023 April 1. ప్రముఖ వాహన తయారీదారు 'హోండా కార్స్ ఇండియా' తన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ 'అమేజ్' ధరను 2023 ఏప్రిల్ 1 నుండి పెంచబోతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 24, 2023, 01:46 PM IST
  • ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న కారు ధర
  • ఇప్పుడే బుక్ చేసుకుంటే బెటర్!
  • వేరియంట్‌లను బట్టి ధరల పెంపు
Honda Amaze Price Hike 2023: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆ కారు ధర.. కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి!

Honda Amaze price hiked by Rs 12000 from 2023 April 1: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ తన ఉత్పత్తుల ధరలను 2023 ఏప్రిల్ నుంచి పెంచనున్న విషయం తెలిసిందే. రెండవ దశ BS-VI ఉద్గార నిబంధనలకు (BS-6 ఫేజ్-II) అనుగుణంగా అన్ని వాహనాలను తయారవుతున్నాయి. ఆటోమొబైల్‌ పరికరాల ధరలు నిత్యం పెరుగుతున్నాయి కాబట్టి కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచబోతున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ రుతీ సుజుకీ, నిస్సాన్‌ ఇప్పటికే పెంచాయి. హోండా కూడా తమ కార్ల ధరలను పెంచింది. 

ప్రముఖ వాహన తయారీదారు 'హోండా కార్స్ ఇండియా' తన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ 'అమేజ్' ధరను 2023 ఏప్రిల్ 1 నుండి (Honda Amaze Price Hike 2023) పెంచబోతోంది. ఈ కారు ధరను రూ. 12000 వరకు పెంచే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న కఠినమైన ఉద్గార నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ధరలను పెంచినట్లు హోండా పేర్కొంది. ఈ కారు మోడల్ యొక్క విభిన్న వేరియంట్‌లను బట్టి ధరల పెంపు ఉంటుంది.

హోండా కార్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) కునాల్‌ బెహ్ల్‌ మాట్లాడుతూ... 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమేజ్‌ ధరలు రూ. 12000 మేర పెరగనున్నాయి. కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా ఉత్పత్తి ఖర్చు పెరిగిందని, దానిని దృష్టిలో ఉంచుకుని ఈ ధరల పెంపు చర్య తీసుకోబడిందన్నారు. 

అయితే మిడ్-సైజ్ సెడాన్ 'సిటీ' ధరల్లో కంపెనీ ఎలాంటి మార్పు చేయదని కునాల్‌ బెహ్ల్‌ తెలిపారు. కొత్త 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఇటీవలే ప్రారంభించబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ADAS దాని సాధారణ ICE మోడల్‌లో కూడా ఇవ్వబడింది. ఇది భారతదేశంలో చౌకైన ADAS కారు. ప్రస్తుతం హోండా అమేజ్ ధర రూ. 6.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర  రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ నెలలో బుక్ చేసుకుంటే.. రూ. 12000 మేర ఆదా చేసుకోవచ్చు. 

Also Read: సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. సింగిల్ ఛార్జింగ్‌తో 456 కిమీ! నెక్సాన్ ఈవీకి గుడ్ బై చెప్పాల్సిందే  

Also Read: Sanju Samson: భారత జట్టులోకి రావాలంటే.. సంజూ శాంసన్ ఇంకా ఏం చేయాలి! బీసీసీఐని ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎంపీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News