FD Interest Rates: దేశంలో సురక్షిత పెట్టుబడి అనే విషయానికి వస్తే.. అందరికి అందుబాటులో ఉండి ఎక్కువ మంది ఎంచుకునేదుది ఫిక్సిడ్ డిపాజిట్స్. ఫిక్సిడ్ డిపాజిట్స్ ద్వారా అధిక పెట్టవచ్చు మరియు పెట్టుబడి పై వడ్డీని కూడా పొందవచ్చు. నిజానికి ఇతర మాధ్యమాల్లో పెట్టె పెట్టుబడితో పోలిస్తే ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా వచ్చే రాబడి తక్కువగా ఉన్నందువలన మనలో చాలా మంది ఫిక్సిడ్ డిపాజిట్ వైపు మొగ్గుచూపరు. ఈ కారణం చేతనే చాలా మంది వేరే వాటిల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొన్ని బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్స్ వచ్చే వడ్డీని కూడా తగ్గించేసాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్
ఫిక్సిడ్ డిపాజిట్స్ లపై పెట్టె డబ్బు పై వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంకు తగ్గించింది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల FDలకు 3 శాతం నుండి 7.10 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ FDలకు 10 bps వరకు తగ్గింపు చేసింది.
ఎస్ బ్యాంక్
ఎస్ బ్యాంక్ కూడా ఎఫ్‌డిపై చెల్లించే వడ్డీని కూడా తగ్గించింది. తాజాగా విడుదల చేసిన వడ్డీ రేటు ప్రకారం.. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ FD చేసే సాధారణ పౌరులకు, బ్యాంక్ FDపై 3.25 నుండి 7.25 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. కాగా, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8 శాతం వడ్డీని అందిస్తుంది యస్ బ్యాంక్.
HDFC బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా తన ఎఫ్‌డి రేటులో మార్పులు చేసింది. HDFC బ్యాంక్ తన 35 నెలల మరియు 55 నెలల కాల పరిమితి ఉన్న FDల వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. దీని కింద రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలకు గతంలో 35 నెలలకు 7.20 శాతం ఉండగా.. 55 నెలలకు 7.25 శాతం వడ్డీ ఇస్తుంది. ప్రస్తుతం ఆ వడ్డీ రేట్లను 35 నెలలకు 7.15 శాతంగాను మరియు 55 నెలలకు 7.20 శాతం వడ్డీ ఇస్తుంది
Also Read: Top Load Washing Machine: ఈ హాట్ డీల్ మీ కోసం..అతి తక్కువ ధరకే 8Kg టాప్ లోడ్ వాషింగ్ మెషిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి