Budget smartphones Under Rs.10K స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారుతోంది. షాపింగ్ నుంచి బిల్లుల చెల్లింపు సహా దాదాపు అన్ని అవసరాలు స్మార్ట్‌ఫోన్‌తో చిటికెలో ఐపోతున్నాయి.
ఈ కారణంగా మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరిగింది. అయితే ఒకప్పుడు స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా ఉన్న కారణంగా కొంతమంది కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ సహా వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి.
రూ. 10 వేల లోపు ధరలోనే (Smartphones Under Rs.10k) అన్ని ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేందుకు వీలుంది. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు రూ.10 వేల లోపు ఏవో ఇప్పుడు చూద్దాం.
జియో ఫోన్ నెక్ట్స్..
గూగుల్, జియో సంయక్తంగా ఈ ఫోన్‌ను (JioPhone next) అభివృద్ధి చేశాయి.
ధర రూ.రూ.6,499
ఒకేసారి ధర మొత్తం చెల్లించలేము అనుకుంటే.. వారికోసం ప్రత్యేక ఈఎంఐ సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చింది జియో. 18 లేదా 24 నెలల సులభతర వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం కల్పిస్తోంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ..
దాదాపు పూర్తి స్థాయి దేశీయ టెక్నాలజీతో ఈ మొబైల్‌ను రూపొందించింది మైక్రోమ్యాక్స్. కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వెననబడిన ఈ కంపెనీ.. ఇన్ సిరీస్‌తో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఫోన్లను (Micromax in 2B) తెస్తోంది.
ధర రూ.8,999
రియల్మీ నార్జో 30ఏ (Realme Narzo 30A)
మోటో ఈ7 పవర్(Moto E7 Power)..
స్టాక్ ఆడ్రాయిడ్ కావాలనుకునే వినియోగదారులు ఈ మోబైల్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫోన్లలో ఎలాంటి బ్లోట్ ఉండదు.
ధర రూ.8,999
Also read: Flipkart Realme Festive Sale: రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులోని స్మార్ట్ ఫోన్స్
Also read: Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Budget smartphones: రూ.10 వేలలోపే అదిరే స్మార్ట్ఫోన్లు- ఫీచర్లు ఇవే..