YSRCP Plenary-2022: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీకి వేళాయే..రెండురోజుల సమావేశాల్లో ఎజెండా ఇదే..!

YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. 

Written by - Alla Swamy | Last Updated : Jul 7, 2022, 11:11 AM IST
  • ఏపీలో వైసీపీ స్పీడ్
  • రేపటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ
  • ఏర్పాట్లన్నీ పూర్తి
YSRCP Plenary-2022: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీకి వేళాయే..రెండురోజుల సమావేశాల్లో ఎజెండా ఇదే..!

YSRCP Plenary-2022: గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ముందు శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. ఈ సమావేశాల్లో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా పాల్గొననున్నారు. గత కొంతకాలంగా ఆమె పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ప్లీనరీకి రాబోరని వార్తలు వినిపించాయి. దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయం స్పష్టత ఇచ్చింది. రెండో రోజు ఆమె ప్రసంగం ఉండనుంది. 

తొలిరోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. రేపు(శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశం ప్రారంభమవుతుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండాను సీఎం జగన్‌ ఆవిష్కరించనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రార్థన ఉంటుంది. ఉదయం 10.55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. 

శుక్రవారం ఉదయం 11 గంటలకు వైసీపీ చీఫ్, సీఎం జగన్‌ ప్రసంగం ఉండనుంది. అనంతరం పార్టీ డిట్ నివేదిక, పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. ఉదయం 11.45 గంటలకు మహిళా సాధికారత దిశ చట్టంపై తీర్మానం చేయనున్నారు. విద్య తీర్మానంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌తోపాటు ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగిస్తారు. ఆ తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, వైద్యం తీర్మానాలు చేస్తారు.

Also read:Minister Srinivas Goud Case: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో ట్విస్ట్..పిటిషన్‌ వేసిన నిందితులు..!

Also read:Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల విడుదల..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News