YS Vijayamma: వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కుటుంబ కలహాలే కారణమా..?

YS Vijayamma: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలుపుతున్నారు. తొలి రోజు సమావేశంలో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.  

Written by - Alla Swamy | Last Updated : Jul 8, 2022, 10:52 PM IST
  • గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ
  • పలు కీలక తీర్మానాలకు ఆమోదం
  • గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా
YS Vijayamma: వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కుటుంబ కలహాలే కారణమా..?

YS Vijayamma: అంతా అనుకున్నట్లుగానే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారని..ఆమెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మాస్ లీడర్ అని..ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. 

పేదల ఇంటికే సంక్షేమ ఫలాలను తీసుకెళ్తున్నారన్నారు వైఎస్ విజయమ్మ. యువతకు సీఎం జగన్ రోల్‌ మోడల్‌గా మారారని తెలిపారు. తల్లిగా జగన్‌కు ఎప్పటికి అండగా ఉంటానని తేల్చి చెప్పారు. ఇద్దరు బిడ్డలు వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నారని..ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదన్నారు. ఆనాడు జగన్‌పై అధికారిక శక్తులన్నీ కుట్రలు చేశాయని గుర్తు చేశారు. 

అక్రమంగా కేసులు పెట్టి వేధించారని..ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలిచామన్నారు విజయమ్మ. సహనం, ఓర్పుతో జగన్‌ ఎంతో ఎత్తుకు ఎదిగారని..వైఎస్‌ఆర్‌ అందరి వాడరని చెప్పారు. కోట్ల మంది గుండెల్లో సజీవంగా ఉన్నారని..ఇచ్చిన మాట నుంచి వైసీపీ పుట్టిందన్నారు. విజయమ్మ రాజీనామాపై గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్‌ కుటుంబంలో గొడవలు ఉన్నాయని..జగన్‌, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని కథనాలు సైతం వచ్చాయి. ఈక్రమంలోనే వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Also read:Sai Pallavi: కాశ్మీరీ ఫైల్స్ కామెంట్స్ మీద సాయి పల్లవికి హైకోర్టు షాక్

Also read:YSRCP Plenary Live Updates:ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు..వైసీపీకి విజయమ్మ రాజీనామా    

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News