Kesineni Nani:చంద్రబాబుకు ఇవ్వాల్సిన బొకేను విసిరిగొట్టిన కేశినేని నాని.. టీడీపీలో కలకలం

Kesineni Nani:ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు షాకిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. కేశినేని నాని వ్యవహారం హాట్ హాట్ గా మారింది.  

Written by - Srisailam | Last Updated : Aug 6, 2022, 12:48 PM IST
  • చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రచ్చ
  • బాబుకు బొకే ఇవ్వని కేశినాని నాని
  • బొకేను విసిరిగొట్టిన కేశినేని నాని
 Kesineni Nani:చంద్రబాబుకు ఇవ్వాల్సిన బొకేను విసిరిగొట్టిన కేశినేని నాని.. టీడీపీలో కలకలం

Kesineni Nani: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కొన్ని రోజులుకా విజయావడ ఎంపీ కేశినేని వ్యవహారం సెగలు రేపుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాని.. చంద్రబాబును ఇరుకున పెట్టేలా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కేశినేని నాని తీరుతో ఆయన టీడీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోదర్ తో కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారని తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు షాకిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. కేశినేని నాని వ్యవహారం హాట్ హాట్ గా మారింది.

ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వినాశ్రయంలో చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించారు. ఈ క్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ బొకేను పుష్ప చంద్రబాబుకు ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని చేతికి ఇవ్వబోయారు. అయితే జయదేవ్ ఇచ్చిన పుష్పగుచ్చాన్ని తీసుకోకుండా పక్కకు విసిరేశారు ఎంపీ కేశినేని నాని. చంద్రబాబుతో మాట్లాడలేదు. టీడీపీ ఎంపీలతోనే ఉన్నా పార్టీ అధినేతకు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు ఎంపీ నాని. ఎయిర్ పోర్టు లాంజ్ వరకు చంద్రబాబుతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్నా ఎంపీ కేశినేని నాని  అసహనంగానే కనిపించారు. చంద్రబాబు దూరంగానే ఉండే ప్రయత్నం చేసారు.చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని నేరుగా అసహనం వ్యక్తం చేశారనే చర్చ సాగుతోంది.

కొన్ని రోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం నడుస్తోంది. విజయవాడ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు నాని సోదరుడు చిన్ని. అయితే తనకు వ్యతిరేకంగా పార్టీ పెద్దలే చిన్నిని ప్రోత్సహిస్తున్నారని నాని ఆరోపిస్తున్నారు. తమ్ముడిపై బహిరంగంగానే వార్ కు దిగారు.తన ఎంపీ స్టిక్కర్‌ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు కేశినేని నాని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తర్వాత కేశినేని చిన్ని మరింత దూకుడు పెంచారు. విజయవాడ లోక్ సభ పరిధిలోని టీడీపీ నేతలను కలుస్తూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. వంగవీటి రాధాతోనూ చిన్ని సమావేశమయ్యారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ ఎంపీ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానంపై భగ్గుమంటున్నారు కేశినేని నాని.తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో తన అక్కసును వెళ్లగక్కారు కేశినేని నాని.



Also Read: India Corona Update: అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే?

Also Read: రేపే ఎస్సై ప్రిలిమ్స్‌ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News