TTD: తిరుమలలో ప్రధానికైనా.. సామాన్య భక్తుడికైనా ఒకే భోజనం!

TTD Srivari Annaprasadam: తిరుమలలో ఇక నుంచి ప్రధాని నుంచి సామాన్య భక్తుడి వరకూ అందరికీ ఒకే రకమైన భోజనాన్ని అందించనున్నారు... టీటీడీ ఇలా పలు అంశాలపై తాజాగా నిర్ణయాలు తీసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 07:30 PM IST
  • కీలక నిర్ణయాన్ని తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌
  • తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైనటువంటి భోజనం
  • ప్రైవేట్‌ హోటల్స్, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌ను తొలగించాలని నిర్ణయం
  • పలు అంశాలపై నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డ్
TTD: తిరుమలలో ప్రధానికైనా.. సామాన్య భక్తుడికైనా ఒకే భోజనం!

Tirumala Latest Information: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైనటువంటి భోజనాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో ప్రైవేట్‌ హోటల్స్, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. 

ప్రధానమంత్రి నుంచి ప్రతి సామాన్య భక్తుడి వరకు.. అందరికీ ఒకే రకమైనటువంటి భోజనాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తులు ఎవరూ కూడా భోజనాన్ని డబ్బు వెచ్చించి కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు పలు నిర్ణయాలను బోర్డ్‌ తీసుకుంది. 

త్వరలోనే తిరుమలో సర్వదర్శనాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. తిరుమలలో మళ్లీ కొవిడ్‌కు ముందు ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

ఇక 2022-23కు గాను రూ. 3096 కోట్ల వార్షిక బడ్జెట్‌కు టీటీడీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అన్నమయ్య నడక మార్గాన్ని డెవలప్‌ చేయాలని బోర్డ్‌ డిసైడ్‌ అయ్యింది. ఇక తిరుపతిలో పద్మావతి కిడ్స్‌ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి రూ. 230 కోట్లు టీటీడీ కేటాయించింది. త్వరలోనే ఈ హాస్పిటల్‌ నిర్మాణానికి సంబంధించి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

Also Read: టీమిండియా స్టార్ బౌలర్‌కు వార్నింగ్.. ఇక ఆడకుంటే అంతేసంగతులు అన్న బీసీసీఐ! ఇషాంత్‌, ఉమేష్ మాదిరే!

Also Read: Andhra Pradesh Theatres: థియేటర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి 100 శాతం కెపాసిటీకి అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News