Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు  తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Apr 14, 2024, 07:56 PM IST
  • తెనాలి సభలో తీవ్ర కలకలం..
  • పవన్ కళ్యాన్ పై రాళ్లదాడి..
Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..

Stone Attack On Pawan kalyan In Guntur Tenali Varahi Public Meeting: ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజకీయాల్లో కీలక నేతలపై వరుస దాడులు కలకలంగా మారాయి. నిన్న విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆగంతకులు రాత్రిపూట రాళ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఇదిలా ఉండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆదివారం నాడు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. ఒక ఆగంతకుడు ఆయనపై రాళ్లను విసిరాడు. అది కాస్త గురితప్పి ఆయనకు దూరంగా పడింది. వెంటనే జనసేన కార్యకర్తలు, సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. పవన్ కళ్యాన్ చుట్టు చేరి ఆయనకు బందోబస్తు కల్పించారు. రాళ్లు వేసిన వ్యక్తిని గుర్తించి, పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

Read More: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..

రాళ్లు దూరంగా పడటంతో పోలీసులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కీలక నేతల ప్రచారంలో ఇలాంటి వరుస సంఘటనలు చోటు చేసుకొవడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుల్తానాబాద్ నుంచి గాంధీ వరకు ర్యాలీ నిర్వహించనట్లు తెలుస్తోంది. తెనాలి సభ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మరికొద్ది సేపట్ల ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తొంది. 

ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్ పై కొందరు ఆకతాయిలు రాళ్లతో బలంగా  కొట్టారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో బస్సుమీదఅభివానం చేస్తుండగా.. ఒక్కసారిగా ఎవరో ఆకతాయిలు బలంగా ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా అది సీఎం జగన్ కు ఎడమ కంటికి బలంగా తాకింది. వెంటనే ఆయన నొప్పిని తాళలేక తన చేతితో పట్టకున్నారు.

ఆయన పక్కనున్న వెల్లంపల్లికి కూడా మరో రాయి తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది సీఎం జగన్ ను బస్సులోపలికి చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించారు.  కాగా సీఎం జగన్ బస్సు యాత్ర నాలుగు గంటలుగా జరుగుతున్నట్లు తెలుస్తొంది. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే బొండా ఉమా, టీడీపీ కార్యలయం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడి చేసిన ఆగంతుకుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగ.. సీఎం జగన్ పై కదిరిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులో చెప్పులతో దాడి చేసిన విషయం తెలిసిందే.సీఎం జగన్ ను అంతమోందిచేందుకు కుట్ర జరిగిందనికూడా ఏపీ రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాల లేకపోవడం, దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో టీడీపీ ఆఫీస్ ఉందన్నారు. దాడికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు బాధ్యత వహించాలని వైసీపీ నేతలు అంటున్నారు.

Read More: Smita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో..

ఇది ముమ్మటికి చంద్రబాబు కుట్ర అని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను భరించలేకే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇక దాడి ఘటనను.. సీఎం చెల్లెలు, వైఎస్ షర్మిలా, పీఎం మోదీ, సీఎం స్టాలీన్, మమతా బెనర్జీ, కేటీఆర్ వంటి పలువురు నేతలు ఖండించారు. దీనిపై ఎన్నిలక కమిషన్ కూడా  సీరియస్ అయ్యింది. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా విజయవాడ ఎస్పీని ఆదేశించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News