Road accident in tirumala: తిరుమలలో ఇటీవల అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తిరుమలలో.. ఇటీవల లడ్డు కౌంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంతే కాకుండా.. తిరుమలలో పరాకామణిలో ఇటీవల ఒక ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు. ఆ తర్వాత తిరుమల ఘాట్ రోడ్డులో.. ఇటీవల బస్సు ప్రమాదం జరిగింది.
బ్రేకింగ్ న్యూస్
తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం
మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా
నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు https://t.co/sNYubMfNhx pic.twitter.com/QanxcJ1176
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025
తిరుమలలో కొంత మంది రాజకీయా నేతలు తరచుగా ఏదో ఒక అంశాలతో వివాదాలను రాజేస్తున్నారు. అంతే కాకుండా.. రీల్స్, డ్యాన్స్ లు చేస్తు వివాదస్పదంగా ప్రవర్తిస్తున్నారు. తిరుమలలో ఇటీవల గుడ్డు, పలావ్ బైటపడింది. ఇటీవల బస్సు ప్రమాదం కూడా జరిగింది. తిరుమలలో దర్శనానికి వచ్చిన భక్తులు తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయారు.
ఇక తిరుమల వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ప్రమాదం మాత్రం.. టీటీడీ చరిత్రలోనే మాయని మచ్చగా చెప్పుకొవచ్చు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో తాజాగా.. తిరుమలలో మరో ప్రమాదం జరిగింది.
మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో.. నలుగురు గాయపడ్డారు.. వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. భక్తుల కారు ఎగిరి మరోవైపు పడింది. దీంతో అక్కడున్న వారు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. తిరుపతిలోని ఆస్పత్రికి బాధితుల్ని తరలించారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter