Jogi Ramesh, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు.. మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

Jogi Ramesh Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి ఏపీ మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పగటి వేషగాడని, విజిటింగ్ వీసాపై ఏపీకి వచ్చిపోతాడని ఎద్దేవా చేశారు. 

Written by - Pavan | Last Updated : Nov 27, 2022, 08:51 PM IST
  • పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి పరుష పదజాలంతో విరుచుకుపడిన మంత్రి జోగి రమేష్
  • నెలకొకసారి ఏపీకి వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టడం తప్ప చేసిందేంటి ?
  • వాళ్లంతా ఏకమై వచ్చినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరన్న జోగి రమేష్
Jogi Ramesh, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు.. మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

Jogi Ramesh Comments on Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక పగటి వేషగాడు అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ నెల రోజులకు ఒకసారి ఏపీకి విజిటింగ్ వీసా మీద వచ్చి మీడియాతో మాట్లాడి పారిపోతాడు అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు.. సైకో సేన అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడిస్తామని పవన్ కళ్యాణ్ చేస్తోన్న సవాళ్లపై జోగి రమేష్ స్పందిస్తూ.. వైఎస్ జగన్ కంచుకోటను ఇంచు కూడా కదిలించలేవని అన్నారు. 

సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని యావత్ దేశమంతా హర్షిస్తోంటే మీరు ఏం చేయగలరని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు.. చంద్రబాబుతో పాటు ఆయనకు అండగా నిలిచిన మీడియా వాళ్లంతా కలిసొచ్చినా చిత్తుచిత్తుగా ఓడిపోతారని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఎలాగైతే ఓడిపోయాడో.. అదే తరహాలో రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా అలాగే ఓడిపోతాడని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. 

తనపై కక్ష పెంచుకునే ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చేవేసిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడని అన్నారు. ఆ పిచ్చోడిని నమ్ముకున్న అమాయకజనం పాపం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. వారికి జరిమానాలు కూడా పడ్డాయని అన్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రజలపై ప్రేమ లేదని.. అతడు పారిపోయే రకమే అని అన్నారు. 

కేవలం వైఎస్ఆర్సీపీనీ తిట్టడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు తప్పితే అంతకు మించి చేసిందేమి లేదని మంత్రి జోగి రమేష్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ నిజంగా జనం కోసం నిలబడే వాడే అయితే ఏపీలో 175 స్థానాల్లో జనసేన పార్టీ పోటి చేస్తుందని.. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని పవన్ కళ్యాణ్ ని చెప్పమనండి చూద్దాం అని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. జోగి రమేష్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఏమని స్పందించనున్నారో వేచిచూడాల్సిందే మరి.

Also Read : Pawan Kalyan: కోడి కత్తులతో గీయించుకుని డ్రామాలు.. నా అభిమానులు జగన్‌కే ఓటు వేశారు: పవన్ కళ్యాణ్‌

Also Read : Anil Kumar Yadav: అయ్యప్ప మాలలో ఉండి ముస్లిం టోపీ ధరించిన అనిల్ కుమార్ యాదవ్.. క్లారిటీ ఇదే..!

Also Read : Pawan Kalyan About Caste: దేశం భావన లేకపోయినా.. కులం భావన పెట్టుకోండి: పవన్ కళ్యాణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News