Amit Shah Visits AP: 18న ఏపీకి అమిత్ షా.. పవన్ తో స్పెషల్ భేటీ..!

Amit Shah Visits AP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ లో  పర్యటించనున్నారు. రీసెంట్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించిన లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలో  రేపు అమిత్ షా ఏపీ పర్యటనకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 17, 2025, 03:24 PM IST
Amit Shah Visits AP: 18న ఏపీకి అమిత్ షా.. పవన్ తో స్పెషల్ భేటీ..!

Amit Shah Visits AP: ఏపీలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11వేల 500 కోట్లు ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో  భారత హోం మినిష్టర్ అమిత్ షా ఏపీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ విందుకు హజరవుతారు. ఈ సందర్భంగా  సీఎం చంద్రబాబుతో అమిత్‌ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. మరుసటి రోజు విజయవాడ సమీపం కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ క్యాంపులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండు కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధి లోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

అంతేకాదు ఏపీలో త్వరలో భర్తీ చేయబోయే కార్పోరేషన్ సహా పలు నామినేట్ పదవుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఏపీలో చేపట్టబోయే పలు అభివృద్ది కార్యక్రమాల పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో  చర్చించున్నారు. అంతేకాదు ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలు చర్చించనున్నట్టు సమాచారం. మరోవైపు అమిత్ షా ప్రభుత్వ కార్యక్రమాలతో తర్వాత బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలతో భేటి కానున్నారు. అంతేకాదు ఏపీలో పార్టీ బలోపేతం చేయడంపై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. కూటమిలో ఉంటూనే తమ బలం పెంచుకునే దిశగా నేతలకు రూట్ మ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News