Andhra Pradesh: ఏపీలో వృద్ధాప్య పింఛను పెంపు..జనవరి 1 నుంచి అమలు..

AP News: రాష్ట్రంలోని పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 04:26 PM IST
  • ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్
  • కొత్త ఏడాది నుండి వృద్ధాప్య పింఛను పెంపు
  • ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభం
Andhra Pradesh: ఏపీలో వృద్ధాప్య పింఛను పెంపు..జనవరి 1 నుంచి అమలు..

Andhra Pradesh: వృద్ధాప్య పెన్షన్​దారులకు ఏపీ ప్రభుత్వం(Ap govt) శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పింఛను(pension) పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నెలనెలా ₹2,250ల చొప్పున పింఛను ఇస్తుండగా.. ఇకపై దాన్ని ₹2,500లకు పెంచి ఇవ్వనుంది. 'స్పందన'పై కలెక్టర్లతో సీఎం జగన్(CM Jagan) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: Aarogyasri app: ఏపీలో త్వరలో ఆరోగ్యశ్రీ యాప్, జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్

 

ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం(EBC Nestham) అమలు చేస్తామన్న ఆయన.. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో రూ. 45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. జనవరిలోనే రైతు భరోసా(Raithu Barosa) సాయం ఇస్తామన్న సీఎం...ఏ తేదీని ఇవ్వబోయేది స్పష్టం చేయలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link -https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News