Undavilli Arun Kumar: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీని సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అభ్యతరం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీ వివాదంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పీఆర్సీపై(PRC) అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా..సమ్మెకు దిగాయి. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాజీపడే సమస్యేలేదని చెబుతూ హైకోర్టును కూడా ఆశ్రయించాయి. అయితే ఏపీ హైకోర్టు ఉద్యోగుల సమ్మెపై మొట్టికాయలు వేసింది. పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది.
మరోవైపు ఇదే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavilli Arun kumar) స్పందించారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు లేఖ రాశారు. కరోనా భీభత్సం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..సమ్మెను ఆపాల్సిందిగా కోరారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం వల్ల 10 వేల కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్న సంగతిని కూడా గుర్తు చేశారు. ప్రభుత్వ, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఇదిలా ఉండగా..సచివాలయ ఉద్యోగుల సంఘం కూడా సమ్మె విషయమై కీలక సమావేశం నిర్వహించింది. ఇతర సంఘాలతో కలిసి సమ్మెకు వెళ్లే అంశమై చర్చిస్తోంది. పీఆర్సీపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చలకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
Also read: AP High Court: పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.