CM Jagan to Inaugurate Owk Reservoir Second Tunnel: రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ.567.94 కోట్ల వ్యయంతో అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండో టన్నెలు పనులు పూర్తయ్యాయి. మూడవ టన్నెల్‌కు సంబంధించి ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. దీంతో ఇప్పటికే మొత్తం రూ.1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి. గురువారం రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20 వేల క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా జిల్లా మెట్టుపల్లె వద్ద విడుదల చేయనున్నారు సీఎం జగన్.
ప్రయోజనాలు ఇలా..
==> శ్రీశైలం కుడి గట్టు కాలువ క్రింద 1.5 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా..
==> గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కింద గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, మైలవరం, పైడిపాలెం తదితర రిజర్వాయర్లకు రోజుకు ఒక టీఎంసీ చొప్పున అదనపు నీటి సరఫరాకు వెసులుబాటు..
==> ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు..
==> 1.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ- 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగునీరు..
వేగంగా అవుకు టన్నెల్-3 పనులు..
కృష్ణా నదిలో వరద నీరు లభ్యమయ్యే సమయం రోజురోజుకి తగ్గిపోతున్న నేపథ్యంతో గురువారం ప్రారంభిస్తున 20 వేల క్యూసెక్కులకు అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీటిని త్వరితగతిన తరలించేలా రూ.1,297.78 కోట్ల వ్యయంతో చురుగ్గా అవుకు టన్నెల్-3, డిస్ట్రిబ్యూటరీ, ఇతర అనుబంధ పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.934 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 5.801కి.మీ పొడవులో ఇప్పటికే 4.526 కి.మీ పనుల పూర్తి చేయగా.. మొత్తం 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది.
అవుకు ప్రాజెక్టుకు ఇప్పటి వరకు చేసిన వ్యయం
==> 2004-05 నుంచి 2013-14 వరకు 340.53 కోట్లు
==> 2014-15 నుంచి 2018-19 వరకు 81.55 కోట్లు
==> 2019-20 నుంచి 2023-24 వరకు రూ.145.86 కోట్లు.. టన్నెల్ 3 కోసం రూ.934 కోట్లు ఖర్చు
==> ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం రూ.1,501.94 కోట్లు
అవుకు 1, 2 టన్నెల్స్ ముఖ్యాంశాలు
==> గోరకల్లు నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 60 కి.మీ పొడవున వరద కాలువ, కొనసాగింపుగా సొరంగం తవ్వకం పనుల పూర్తి..
==> అన్ని అవాంతరాలను అధిగమించి, ఫాల్ట్ జోన్లో 180 మీటర్ల సొరంగం నిర్మాణంతో పాటు లైనింగ్ పనులు పూర్తి.. కుడి, ఎడమ టన్నెల్స్‌లో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు..
==> తద్వారా రాయలసీమకు మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా తరలించే వెసులుబాటు..
==> గాలేరు-నగరి వరద కాలువ ద్వారా 15 రోజుల్లోనే గండికోట రిజర్వాయర్ నింపేందుకు అవకాశం..
==> శ్రీశైలం జలాశయానికి వరద వచ్చే సమయంలో 20 వేల క్యూసెక్కుల చొప్పున రాయలసీమకు రోజుకు 2 టీఎంసీల నీటి సరఫరా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి