CM Jagan Kadapa Tour: కడప జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు ఆరోగ్య సమాజం కోసం ఎంతో మంది వైద్యులను అందిస్తున్న రిమ్స్.. మెడికల్ హబ్ గా రాయలసీమకే తలమానికంగా మారిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. శనివారం కడప రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన డా.వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డా.వైఎస్ఆర్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డా.వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్లతో పాటు రిమ్స్ సమీపంలోని డా.వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన ఎల్.వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా వేర్వేరుగా ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రిమ్స్ ఆసుపత్రి.. కేవలం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలో కూడా ప్రజలకు అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో మెరుగైన వైద్యసేవలతో వేలాది మంది ప్రజలకు ప్రతి నిత్యం ప్రాణ రక్షణ కల్పిస్తూ సంజీవనిగా సేవాలందిస్తోందన్నారు. రిమ్స్ భోధనాసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో కోట్లాది రూపాయలను వెచ్చించి.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాలలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
రాయలసీమలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించే మెడికల్ హబ్ గా రిమ్స్ అనుబంధ ఆసుపత్రుల్లో సేవలు విస్తృతం కానున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందన్నారు. వైద్య విభాగాధిపతులు కేవలం వైద్యం వరకే పరిమితం కాకుండా.. ఆయా విభాగాల్లో పరికరాల నిర్వహణ, యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యరంగం పటిష్టత కోసం కృషి చేయాలని కోరారు.
అనంతరం జిల్లా మినరల్ ఫండ్ ద్వారా ఆధునీకరించిన జిల్లా కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించారు సీఎం జగన్. వీటితో పాటు అగ్నిమాపక ఉపకరణాల (రెస్క్యూ పరికరాలు)ప్రారంభం, దివ్యంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా కలెక్టరేట్ పరిపాలనా విభాగాలు, కంట్రోల్ రూమ్ నిర్వహణ విధుల గురించి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ముఖ్యమంత్రికి వివరించారు. కడప కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లాలోని అర్హులైన 50 మంది దివ్యాంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను సీఎం జగన్ ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం బద్వేలు వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో సెంచురీ ప్లై పరిశ్రమను ప్రారంభించారు ముఖ్యమంత్రి.
Also Read: Hardik Pandya: ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం, తిరిగి కెప్టెన్సీ రోహిత్‌కేనా
Also Read: Ind vs SA Test Series: సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్, ఇద్దరు మినహా సీనియర్ల టీమ్ రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook