Vizag steel plant ప్రైవేటైజేషన్‌పై చిరంజీవి ట్వీట్.. ఆక్సీజన్ ఉత్పత్తిపై ప్రశంసలు

Vizag steel plant వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ని వ్యతిరేకిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశమంతా ఆక్సీజన్ లభించక కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిత్యం 100 టన్నుల మెడికల్ ఆక్సీజన్‌ని (Oxygen crisis) ఉత్పత్తి చేస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2021, 12:20 AM IST
Vizag steel plant ప్రైవేటైజేషన్‌పై చిరంజీవి ట్వీట్.. ఆక్సీజన్ ఉత్పత్తిపై ప్రశంసలు

Vizag steel plant వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ని వ్యతిరేకిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశమంతా ఆక్సీజన్ లభించక కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిత్యం 100 టన్నుల మెడికల్ ఆక్సీజన్‌ని (Oxygen crisis) ఉత్పత్తి చేస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. ఈరోజే ఓ స్పెషల్ ట్రెయిన్ విశాఖ ఉక్కు కర్మాగారానికి చేరిందని, అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సీజన్‌ని మహారాష్ట్రకు తీసుకెళ్తుందని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also read : రెచ్చిపోయిన Devdutt Padikkal, Virat Kohli.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం

ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సీజన్ అందించి లక్షలాది మంది ప్రాణాలు నిలబెడుతోందని.. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ప్రైవేటుపరం చేయడం ఎంతవరకు సమంజసం అని చిరంజీవి ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశంపై మరోసారి పునరాలోచిస్తే బాగుంటుందని చిరంజీవి (Chiranjeevi) కేంద్రానికి హితవు పలికారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేయొద్దని నిరసనలు జరుగుతున్న తరుణంలోనే చిరంజీవి ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News