Delhi HC on Oxygen supply: న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక చోట్ల ఆక్సీజన్ కొరత కారణంగా కరోనా రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. మరోవైపు ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రాలకు వాటికి సమీపంలోని అక్సీజన్ ప్లాంట్స్ నుంచి ఆక్సీజన్ కేటాయింపులు జరిపింది.
IAF planes airlifted oxygen tankers: హైదరాబాద్: తెలంగాణలో ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు యుద్ధ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్స్‌ని ఒడిశాకు పంపించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని (Liquid medical oxygen) రాష్ట్రానికి తీసుకురానున్నారు.
Vizag steel plant వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ని వ్యతిరేకిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశమంతా ఆక్సీజన్ లభించక కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిత్యం 100 టన్నుల మెడికల్ ఆక్సీజన్‌ని (Oxygen crisis) ఉత్పత్తి చేస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు.
Normal levels of oxygen saturation: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంటే.. మరోవైపు డిమాండ్‌కి తగినంత సప్లై లేక ఆక్సీజన్ అవసరమైన కొవిడ్-19 రోగులు పడుతున్న పాట్లు పెరిగిపోతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులను కష్టాలను చూస్తున్న ఇతర పేషెంట్స్, సాధారణ జనం ముందు జాగ్రత్తగా ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్‌పై (Normal oxygen saturation levels) అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.